అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి కంటపడ్డాడు…తర్వాత ఆ తండ్రి ఏం చేసాడో తెలుస్తే షాక్ అవుతారు..!

అశ్లీలం.. మొబైల్ లో ఈజీగా దొరికేస్తోంది. నెట్ ఉంటే చాలు ప్రపంచంలో ఏ మూల ఉన్నా.. మన మొబైల్ లో ప్రత్యక్షం అయిపోతుంది. చిన్న పిల్లలకు సైతం మొబైల్ కంపల్సరీ అయిపోయిన ఈ రోజుల్లో అదేస్థాయిలో అశ్లీలం కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో యువత పెడదోవ పడుతోంది. నేటి పేరంట్స్ కి ఇది సమస్యగా మారింది. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో పాతబస్తీ పహాడీఫరీఫ్ లో జరిగింది. కుమారుడు పదేపదే మొబైల్ లో చూస్తుండటంతో మందలించాడు తండ్రి. అయినా వినకపోవటంతో చేయి నరికేశాడు. ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ పాతబస్తీ పహాడీఫరీష్ జల్ పల్లి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖయ్యుం ఎలక్ట్రిషియన్. పెద్ద కుమారుడు ఖాలెద్ ఖురేషీ (18) లోకల్ కేబుల్ ఆఫీస్ లో పని చేస్తుంటాడు. కొంత కాలంగా ఖురేషీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. పనికి కూడా సరిగా వెళ్లటం లేదు. ఎప్పుడూ మొబైల్ చూస్తూ ఉన్నాడు. ఇది గమనించిన తండ్రి.. ఏం జరుగుతుందో దృష్టి పెట్టాడు. అశ్లీల దృశ్యాలు చూస్తున్నాడని గుర్తించి మందలించాడు. అయినా ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో కుమారుడి మొబైల్ దాచేశాడు. దీంతో తండ్రి – కొడుకు మధ్య గొడవ జరిగింది. ఓ సారి తండ్రిపైనే దాడి చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ సర్ధిచెప్పి ఇంటికి తీసుకొచ్చాడు తండ్రి. అయినా వినకుండా మార్చి 5వ తేదీ సోమవారం ఇంట్లో ఖురేషీ అదే పనిగా మళ్లీ మొబైల్ చూస్తూ తండ్రి కంట పడ్డాడు.

కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. తండ్రి ఖయ్యూం.. మాంసం కొట్టే కత్తితో కుమారుడి చేయి నరికాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఖురేషీని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కుమారుడి చేయి నరికింది నేనే అంటూ తండ్రి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

Comments

comments

Share this post

scroll to top