అవంతికతో పోటీకి నిత్యామీనన్..!

బాహుబలి సినిమాలో అవంతిక పాత్రతో గట్టిమార్కులు కొట్టేసింది తమన్నా, అందంతో, వీరోచిత సన్నివేశాల నటనలో ఔరా అనిపించింది ఈ అమ్మడు. బాహుబలి  తరహాలో చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న చిత్రం రుద్రమదేవి. ఈ చిత్రాన్ని గుణశేఖర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రుద్రమదేవి సినిమాలో నిత్యామీనన్ ముక్తాంబ  గా నటిస్తోంది. బాహుబలిలో తమన్నా అవంతిక పాత్రకు రుద్రమదేవిలో నిత్యా మీనన్ ముక్తాంబ  పాత్రకు మద్య పోటీ ఉండబోతోందంట!

అసలే నటనకు స్కోప్  ఉన్న పాత్రల్లో నిత్యా ఇరగదీస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి ఉదాహరణే మళ్లీ మళ్లీ ఇది రానీరోజు మూవీ.. ఆ సినిమాలో నజీరా పాత్రలో ఒదిగిపోయిందీ గుమ్మడు. ఇప్పుడు చారిత్రక నేపథ్యపు సినిమాలో నటిస్తోందంటే …ఆమె పాత్రకు ఆ సినిమాలో చాలా ఇంపార్టెన్స్ తప్పక ఉంటోంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

mukthamba

ఫిల్మ్ నగర్ వర్గాలు ఒక అడుగు ముందుకేసి, నటనా పరంగా ఇది నిత్యాకు తమన్నా కు మధ్య వార్ అని అభివర్ణిస్తున్నారు. బాహుబలిలో తన నటనతో  తమన్నా మంచి మార్కులే కొట్టేసింది. ఇక ముక్తాంబ పాత్రతో నిత్యా కూడా మంచి ఫెర్ ఫార్పార్మెన్స్ ఇస్తుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. రుద్రమదేవి విడుదలతో తెలిసిపోతోంది. తారామణుల కోల్డ్ వార్ లో నటనాపరంగా ఎవరు బెస్టో అంటున్నారు క్రిటిక్స్.

అయితే పాత్రపరంగ ముక్తాంబ పాత్ర బాహుబలి అవంతిక పాత్రలాగే ఉండబోతోందంట! మరి నిత్యా ఆ పాత్రలో ఎలా నటించింది, ఆ పాత్రకు మూవీలో ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనే పూర్తి డీటైల్స్ తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే!

 

Comments

comments

Share this post

0 Replies to “అవంతికతో పోటీకి నిత్యామీనన్..!”

  1. Satish Satish says:

    thammannah ku antha seen ledhu ra bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top