హారన్ మోగితే మీటర్ పెరుగుతుంది…ఆటోవాలాలా కొత్త మోసం..తెలుసుకోండి.!?

అమ్మో హైదరాబద్ లో ఆటోవాళ్లా ..చాలా ఈజీగా మోసం చేస్తారు అని అనేవాళ్లని..,సినిమాల్లో కూడా అలాంటి సీన్స్ ని చాలానే చూసాం..అవును ఆటో ఎక్కడానికి వచ్చిన వాళ్ల అమాయకత్వాన్ని బట్టి వారికి రూట్ తెలియకపోతే అటు ఇటు తిప్పి  ప్రయాణికులనుండి ఎక్కువ వసూలు చేయడం ఆటోవాలాలు చేసే పనే… కానీ ఇప్పుడు మరొక కొత్త స్టైలో జనాల్ని దోచుకుంటున్నారు..అదెలా అంటే..హారన్ కోట్టి..ఈ హారన్ కి మీటర్ కి ఉన్న సంభందం ఏంటో తెలుసుకోండి..

హారన్ కొడితే మమ్మల్నెలా మోసం చేసినట్టు అంటారా? అదెలాగంటే…డ్రైవర్ ఎన్నిసార్లు హారన్‌ మోగిస్తే అన్ని దఫాలు మీటర్‌ ఛార్జీ పెరుగుతూ ఉంటుంది. ఒక్కో మోతకు రూ.1.10పైసలు.రోడ్డుపై వాహనాలేవీ పెద్దగా లేకున్నా సరే అనవసరంగా పదే పదే హారన్‌ మోగిస్తూ ప్రయాణికుల ఛార్జీలను పెంచేస్తున్నారు . ఇదే  మోసాన్ని వేర్వేరే రకాలుగా చేసేవారూ ఉన్నారు. కొందరు హారన్‌కు, మరికొందరు ఇండికేటర్లు, ముందు లైట్లకు మీటరును కనెక్టు చేసి.. వాటిని ఉపయోగించినప్పుడల్లా ఛార్జీ పెరిగేలా ఏర్పాటు చేసుకుంటున్నారు.

జంట నగరాల్లో ఆటో యజమానులు మూడు రకాలుగా మీటరును హ్యాక్‌ చేస్తూ ప్రయాణికుల జేబుకు చిల్లుపెట్టే కోత్త దందాకు తెరలేపారు. తూనికలు, కొలతల శాఖ తనిఖీల్లో ఇలాంటి షాకింగ్ విషయాలు తెలుసుకుని అవాక్కవడం అధికారుల వంతయింది…మీరు ఇక ఆటోవాళ్లని వస్తావా అని అడిగి.. మీటర్ మీద ఎంత అని అడక్కండి…

Comments

comments

Share this post

scroll to top