ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి “సాలరీ స్లిప్” చూసి ఆటో డ్రైవర్ 200 ఛార్జ్ తీసుకోకుండా వెళ్పోయాడు..ఎందుకో తెలుసా.?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే ఎంతైనా ఆ జాబ్‌కు వ‌చ్చే జీతం ఎక్కువ‌గానే ఉంటుంది క‌దా. నెలకు వేల‌ల్లో సంవ‌త్స‌రానికి ల‌క్ష‌ల్లో జీతాన్ని వారు సంపాదిస్తారు. ఇక అలాంటి జీతంతో వారికి అమ‌రే విలాసాలు అన్నీ ఇన్నీ కావు. కారు, బంగ‌ళా వంటివ‌న్నీ స‌మ‌కూరుతాయి. అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు సంబంధించి జీతాలు, వారికి లభించే విలాసాల మాట నిజ‌మే అయిన‌ప్ప‌టికీ… అవన్నీ తెలిసి కూడా ఆ ఆటోడ్రైవ‌ర్ ఓ ఐటీ ఉద్యోగి వ‌ద్ద త‌న ఆటో చార్జీ తీసుకోలేదు. అత‌న్ని వ‌దిలేశాడు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. త‌న ఆటోలో అత‌న్ని ఫ్రీగా దింపేశాడు. షాకింగ్‌గా ఉన్న‌ప్ప‌టికీ ఈ ఘ‌ట‌న నిజ‌మే. బెంగుళూరులో జ‌రిగిందిది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

బెంగుళూరులో ఉండే ఓ ఐటీ ఉద్యోగి 5 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న త‌న ఇంటికి ఓ ఆటోలో వెళ్లాడు. దీంతో ఆటో డ్రైవ‌ర్ అందుకు రూ.200 అడిగాడు. కేవ‌లం 5 కిలోమీట‌ర్ల‌కు రూ.200 ఎలా అవుతుంది ? త‌క్కువ చేయ‌మ‌ని ఆ ఐటీ ఉద్యోగి ఆ ఆటోడ్రైవ‌ర్‌ను అడిగాడు. అయితే అందుకు ఆటో డ్రైవ‌ర్ చాలా సేపు ఒప్పుకోలేదు. ఆటో చార్జి మొత్తం రూ.200 ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డ్డాడు. దీంతో ఆ ఐటీ ఉద్యోగి చేసేదేం లేక ఏం చూపించాడో తెలుసా..? జేబులోంచి త‌న పే స్లిప్ తీసి ఆ ఆటోవాలాకు చూపించాడు. దీంతో ఆ ఆటోడ్రైవర్ మారు మాట్లాడ‌కుండా, రూ.200 చార్జి తీసుకోకుండానే వెళ్లిపోయాడు.

అయితే స‌ద‌రు ఐటీ ఉద్యోగి చూపించిన పే స్లిప్ లో అత‌నికి వ‌చ్చే జీతం ఎంత ఉందో తెలుసా..? రూ.27,083. అవును, నిజ‌మే. దాన్ని చూసి ఆ ఆటోడ్రైవ‌ర్ త‌న‌కు రావ‌ల్సిన రూ.200 వ‌దులుకుని ఫ్రీ రైడ్ కింద ఆ ఐటీ ఉద్యోగిని వదిలి పెట్టాడు. ఏంటీ.. జీతం బాగానే ఉంది క‌దా. ఎందుకు విడిచిపెట్టాడు. రూ.200 కాక‌పోయినా, క‌నీసం అందులో స‌గం రూ.100 అయినా తీసుకోవ‌చ్చు క‌దా.. అని మీకు డౌట్ వ‌చ్చే ఉంటుంది. కానీ.. అక్క‌డే ఓ ట్విస్ట్ ఉంది. అదేమిటంటే.. ఆ ఐటీ ఉద్యోగి పే స్లిప్‌ను చూశాక ఆ ఆటోడ్రైవ‌ర్ ఏమ‌న్నాడంటే.. త‌న‌కు వారం రోజులు ఆటో న‌డిపితే ఆ ఐటీ ఉద్యోగికి వ‌చ్చే నెల జీతం అంత డ‌బ్బు వ‌స్తుంద‌ట‌. మ‌రి ఇప్పుడు ఎవ‌రి సంపాద‌న ఎక్కువ అవుతుంది చెప్పండి. అందుక‌నే ఆ ఆటోడ్రైవ‌ర్ ఆ ఐటీ ఉద్యోగిని వ‌దిలి పెట్టాడు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఈ విష‌యం నెట్‌లో వైర‌ల్ అవుతోంది..! ఏది ఏమైనా.. ఇది నిజ‌మే క‌దా..! ఒక్కోసారి ఇలా జ‌రుగుతూ ఉంటుంది. అందుకు ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు..!

Comments

comments

Share this post

scroll to top