ఆటో డ్రైవర్ కుమార్తె …ఆ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో టాప్ ర్యాంక్ సాదించేసరికి.! ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసా.?

స‌క్సెస్ అనేది ఎవ‌రికైనా అంత ఈజీగా రాదు. ముందు ఫెయిల్యూర్స్ ఎదుర‌వుతాయి. వాటిని దాటుకుని ఒక్కో స్టెప్ ముందుకు వేస్తూ వెళితేనే ఎవ‌రికైనా స‌క్సెస్ చేరువ‌వుతుంది. దీంతో చివ‌ర‌కు విజ‌యం సాధిస్తారు. స‌రిగ్గా ఇలా ఆలోచించింది కాబ‌ట్టే ఆమె రెండు సార్లు పోటీ ప‌రీక్ష‌లో ఫెయిల్ అయి కూడా పట్టు విడ‌వ‌కుండా చ‌దివింది. దీంతో మూడో సారి విజ‌యం సాధించింది. త‌న కుటుంబానికే కాదు, త‌న రాష్ట్రానికి కూడా ఆమె పేరు తెచ్చింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

ఆమె పేరు పూన‌మ్ తోడి. తండ్రి పేరు అశోక్ తోడి. వీరిది ఉత్త‌రాఖండ్‌లోని తెహ్రి అనే చిన్న ఊరు. అక్క‌డ అశోక్‌కు ఓ షాపు ఉండేది. కానీ అది స‌రిగ్గా న‌డిచేది కాదు. దీంతో త‌న న‌లుగురు పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పిండం, వారి పోష‌ణ భారం చూడ‌డం అశోక్‌కు క‌ష్ట‌మైంది. అందుక‌ని అత‌ను డెహ్రాడూన్‌కు మకాం మార్చాడు. ఆటోడ్రైవ‌ర్‌గా ప‌నిచేయ‌డం ప్రారంభించాడు. రోజుకు రూ.400 నుంచి రూ.500 వ‌ర‌కు వ‌చ్చేవి. అవి కుటుంబ పోష‌ణ‌కు స‌రిపోయేవి.

అలా అశోక్ ఓ వైపు ఆటోడ్రైవ‌ర్ గా ప‌నిచేస్తూనే త‌న భార్య తాను క‌లిసి పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పించ‌డం కోసం త‌మ సుఖాల‌ను త్యాగం చేశారు. అయితే అశోక్ సంతానంలో ఒక‌రైన పూన‌మ్ తండ్రి ప‌డే క‌ష్టాన్ని వృథా కానివ్వ‌లేదు. చ‌క్క‌గా చ‌దివింది. ఎంకామ్, ఎల్ఎల్‌బీ పూర్తి చేసింది. ఎల్ఎల్ఎం కోసం ఉత్త‌రాఖండ్ ప్రావిన్షియ‌ల్ సివిల్ స‌ర్వీసెస్ (జ్యుడిషియ‌ల్‌) ప‌రీక్ష‌ను 2016లో రాసింది. దాని ఫ‌లితాలు తాజాగా వెలువ‌డ్డాయి. వాటిల్లో పూన‌మ్‌కు టాప్ ర్యాంక్ వ‌చ్చింది. అయితే అంత‌కు ముందు ఈ ప‌రీక్ష‌ను 2 సార్లు పూన‌మ్ రాసింది. కానీ ఫెయిల్ అయింది. కానీ చివ‌ర‌కు ప‌ట్టుద‌ల‌తో చ‌ద‌వ‌డంతో ఎట్ట‌కేల‌కు ర్యాంక్ సాధించింది. ఇక‌పై ఎల్ఎల్ఎం చేసి పేద‌ల‌కు న్యాయవాదిగా సేవ చేస్తాన‌ని పూన‌మ్ చెబుతోంది. ఆమె క‌ల నిజం కావాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top