తన ఆటోలో ఎక్కిన లవర్స్ బాధపడలేక ఆ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..? అతని ఫ్రస్టేషన్ లో అర్ధం ఉంది!

అతని పేరు నానాజీ… బ్యాంక్ లో లోన్ తీసుకొని మరీ ఓ ఆటో కొనుక్కున్నాడు, దానినే నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఓ రోజు నానాజీ దాదర్ లోకల్ స్టేషన్ నుండి మహ్మద్ అలీ రోడ్డు వైపు  తన ఆటోలో వస్తున్నాడు .. ఈరోజేంటో బేరం అసలే బాలేదనుకుంటన్నాడు తనలో తాను…అంతలోనే ఓ ప్రేమికుల జంట నానాజీ ఆటోను ఆపారు. అప్పటికే సమయం 5 కావొస్తుంది. అసలు ఆ టైమ్ కి ఆటో సవారితో బిజీబిజీగా ఉండాల….కానీ ఆటో ఖాళీగా ఉండండతో ఆపాడు నానాజీ ఆ ప్రేమికుల జంట దగ్గర….

నారీ మన్ పాయింట్ కు వెళ్ళాళి వస్తావా..? అంటూ అడిగారు,  అసలే ఈ రోజు బేరం లేకపోవడంతో వెంటనే ఎక్కించుకున్నాడు..ఆ ఆటోడ్రైవర్. లవర్స్ ఇద్దరి వయసు  20 కు మించదు… ఆటో నారీమన్ పాయింట్ వైపుగా వెళుతుంది. సోని తెలుసా.. ముంబాయ్ లో నారీమన్ పాయింట్ లవర్స్ కు మంచి అడ్డా తెలుసా…? అంటూ లవర్ తో అంటూనే  సోనీ ని తనవైపుకు లాక్కున్నాడు ఆ అమ్మాయి లవర్.

ఆటో అలాగే వెళుతున్న తరుణంలో…. అబ్బాయి హద్దులు దాటుతున్నాడు.ఆ అమ్మాయి వద్దూ, ఆటో అతను ఉన్నాడని చెబుతున్నా వినకుండా పిచ్చి పనులు చేస్తూనే ఉన్నాడు..అప్పటికే సహానం చచ్చిపోయిన ఆటోడ్రైవర్ , ఆటోను ఓ పక్కకు ఆపి…. బాబూ మీకో దండం, మీ గిరాకీ కో దండం…అసలే ముంబాయ్ రోడ్ల మీద ఆటో నడపడం చాలా కష్టం, పైగా మీ లాంటి  వారిని ఎక్కించుకొని నడపడం చాలా కష్టం అని  వారిని అక్కడే దించేసి…ప్లీజ్ దయచేసి ఇలా చేయకండీ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు.

14_1449821047

మరుసటి రోజు అతని ఆటోలో ఫ్రంట్ మిర్రర్ ముందు ఏకంగా ఓ కొటేషన్ ప్లెక్సీనే పెట్టుకున్నాడు. దాని మీద ఏం రాసుందో తెలుసా..? అబ్బాయి అమ్మాయి ముద్దుపెట్టుకుంటున్న ఫోటో కింద దయచేసి ఇటువంటి పనులు నా ఆటోలో చెయకండి అంటూ రాసి పెట్టుంది.  ఎందుకు నానాజీ నీకు ఇంత ప్రస్టేషన్ అంటే….. మీకేం తెలుస్తుంది సార్…. యాక్సిడెంట్లు అయ్యేది ఇలాగే సార్… మేం మనుషులమే కదా…. మాకు చెవులుంటాయ్ కదా…. మా కాన్సంట్రేషన్ దెబ్బ తింటుంది అని సెలవిచ్చాడంట నానాజీ….. ఆ ప్లెక్సీ చూసి అడిగిన  ప్రయాణికుడికి.!

Comments

comments

Share this post

scroll to top