భారతజట్టుకు ఎంపికైన ఆటో డ్రైవర్ కూతురు.

కృష్ణానది కాస్త వేగంగా ప్రవహిస్తే చాలు ఆ కుటుంబం పునారావాస కేంద్రాలలో తలదాచుకోవాలి, వరద ఎప్పుడు తగ్గుతుందో ఎదురుచూడాల్సిన పరిస్థితి, అలాంటి కుటుంబం నుండి  ఓ ఆణిముత్యం బయటకు వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరూ, చివరికి ఆ తండ్రి కూడా…

కానీ ఆ 19 యేళ్ల అమ్మాయి నిరూపించింది. సాధించే సత్తా ఉంటే ఇవేవి అడ్డంకులు కావని నిరూపించింది. ఏకంగా  భారత మహిళా క్రికెట్ జట్టులో చోటు సంపాదించింది. న్యూజిలాండ్ తో జరిగే పోరులో తన తడాఖా చూపడానికి సిద్దమైంది ఆ అమ్మాయి.

kalpana

కల్పన, దిగువ మధ్య తరగతికి చెందిన అమ్మాయి, తండ్రి ఆటో డ్రైవర్, ప్రకాశం జిల్లా నుండి విజయవాడకు వలసొచ్చిన కుటుంబం..  అటువంటి పరిస్థితుల్లో పూట గడవడమే కష్టం , కానీ నాన్న నేను క్రికెట్ ఆడతా అంటే ఆ తండ్రి వద్దనలేదు, పైగా కూతురిని ప్రోత్సిహించాడు.  ఆ ప్రోత్సాహంతోనే కల్పన నేడు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టి దేశం తరఫున ఆడబోతోంది.
kalpana  selected in indian team

 

కల్పన మొదటి నుండి చాలా చురుకైన అమ్మాయి, తనలోని టాలెంట్ ను గుర్తించిన కృష్ణా జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు గుంటూరు లోని క్రికెట్ అకాడమి లో చేర్పించారు. అక్కడి నుండి ప్రాక్టీస్ పైనే దృష్టి పెట్టిన కల్పన వెను తిరిగి చూడలేదు, ఆంద్ర క్రికెట్ టీమ్, అండర్16, అండర్ 19 ఇలా చకచకా ఆడుతూ వచ్చేసింది. ఏ టోర్నీ అయినా బెస్ట్ వికెట్ కీపర్  అవార్డ్ మాత్రం కల్పనకే దక్కేది.  BCCI  నిర్వహించే  చాలెంజర్స్ ట్రోఫిలో వరుసగా 4 సార్లు తనే బెస్ట్ కీపర్.

kalpana in naational team

సో ఫైనల్లీ మిధాలీ రాజ్ నేతృత్వం వహించే ఇండియన్ఉమెన్స్ టీం లో కల్పన కీపర్ గా ఎన్నికైంది.జూన్ 28 నుండి జులై 8 వరకు బెంగుళూరు లో న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లలో ఆడనుంది. ఆల్ దబెస్ట్ కల్పన.

CLICK: ఒబామా తో వార్ కు రెడీ అయిన భారత సంతతి పౌరుడు.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top