అత్తారింటికి దారేది క్లైమాక్స్ సీన్ చూసి పడి పడి నవ్వుతున్న జనాలు.. పవన్ మూవీ ని నేల పాలు చేసారు..

తెలుగు లో అత్తారింటికి దారేది సినిమా సెన్సేషన్ సృష్టించింది, లాంగ్ రన్ లో ఈ సినిమా అద్భుతంగా ఆడటమే కాకుండా గబ్బర్ సింగ్, దూకుడు, మగధీర సినిమాల రికార్డు లను అధిగమించి నెంబర్ 1 సినిమా గా నిలిచిపోయింది, ఈ సినిమా రికార్డు లను బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు బ్రేక్ చేసాయి, అంతవరకు ఈ సినిమా రికార్డు ని ఎవ్వరు టచ్ చేయలేకపోయారు, సినిమా మొత్తం విడుదలకు ముందే రిలీజ్ అవ్వడంతో పైరసీ భూతం ఈ సినిమాకు పట్టింది, కానీ ఈ సినిమాకు జనాలు అండగా నిలిచారు. టాలీవుడ్ అంతా ఈ సినిమా కోసం ఏకమైంది, సినిమా కూడా బాగుండటం తో అత్తారింటికి దారేది సినిమా కొత్త రికార్డులను నెలకొల్పింది.

ఓహ్ మై శింబు.. :

అత్తారింటికి దారేది సినిమాను శింబు తమిళంలో రీమేక్ చేసాడు, ఈ సినిమా ఫిబ్రవరి 1 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చింది, నవాబ్ సినిమా తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు శింబు. తెలుగు లో బ్లాక్ బస్టర్ అయిన అత్తారింటికి దారేది సినిమా రీమేక్ కావడం తో శింబు అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు ‘వంద రాజా వంద వారువేన్’ సినిమా పైన. అయితే అభిమానుల ఆశల్ని, శింబు ఆశల్ని ‘వంద రాజా వంద వారువేన్’ సినిమా నేల పాలు చేసింది, తమిళ్ లో పెద్ద డిసాస్టర్ గా నిలిచిపోయింది ఈ సినిమా.

సినిమా పోయిన పర్లేదు, కానీ.. :

అత్తారింటికి దారేది సినిమా తమిళ్ లో ఫ్లాప్ అయ్యింది, ఈ సినిమా పోయిన బాధ పడట్లేదు మనోళ్లు, కానీ ఈ సినిమా క్లైమాక్స్ ని చూసి తమిళ్ జనాలు నవ్వుతుంటే మనోళ్ళకి బాధేస్తుంది, తెలుగు లో అత్తారింటికి దారేది క్లైమాక్స్ లో త్రివిక్రమ్ డైలాగ్స్ కి పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు, కానీ తమిళ్ లో శింబు క్లైమాక్స్ సీన్ లో నటించినప్పుడు ఆ సీన్ చూసి తమిళ్ జనాలు నవ్వుకున్నారు, నదియా పాత్ర లో రమ్య కృష్ణ నటించారు. ‘వంద రాజా వంద వారువేన్’ సినిమా క్లైమాక్స్ లో ఆడియన్స్ నవ్వుతున్న వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి, సెంటిమెంట్ సీన్ కాస్త కామెడీ సీన్ అవ్వడం తో మనోళ్లు బాధ పడుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top