అప్పు తీర్చలేక 16 ఏళ్ల కూతురి ని 3 ఏళ్లు రేప్ చేయించాడు ఆ తండ్రి..చివరికి రేప్ చేసిన వ్యక్తి కొడుకు ఏం చేసాడు?

అది 2008వ సంవత్సరం. అప్ప‌టికి టీనాకు 16 ఏళ్లు. త‌ల్లిదండ్రులు ప్ర‌మాదంలో చ‌నిపోవడంతో ఆమె త‌న మేన‌మామ వ‌ద్ద ఉంటోంది. అక్క‌డి నుంచే రోజూ కాలేజీకి వెళ్లి వ‌చ్చేది. అయితే టీనా మేన‌మామ‌ది కూడా పేద కుటుంబ‌మే. బ‌తుకు దెరువు కోసం ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో అప్పు చేసి సొంత ఆటో కొన్నాడు. దానిపైనే ఆధార‌ప‌డి జీవ‌నం సాగిస్తున్నాడు. అయితే ఎప్పుడూ మ‌నం అనుకున్నవి అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌వు క‌దా. టీనా మేన‌మామ విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఆటో ఎంత న‌డిపినా గిట్టు బాటు ధ‌ర‌లు రాక‌పోతుండ‌డంతో పూట గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా మారింది. ఇక ఆటో నెల‌స‌రి వాయిదా చెల్లించ‌డానికి డ‌బ్బులు కూడా ఉండేవి కావు. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఫైనాన్స్ కంపెనీకి ఈఎంఐలు చెల్లించ‌లేక‌పోయాడు. దీంతో ఆ కంపెనీ ఓన‌ర్ ప్ర‌తాప్‌ త‌ర‌చూ టీనా మేన‌మామ ఇంటికి వ‌చ్చేవాడు. డ‌బ్బులు ఎప్పుడు చెల్లిస్తావ‌ని బ‌ల‌వంత పెట్టేవాడు. కానీ అత‌ను ఏం చేస్తాడు..? సంపాద‌నే అంతంత మాత్రంగా ఉంది క‌దా..!

couple-relationship
ఈ క్ర‌మంలో త‌ర‌చూ టీనా మేన‌మామ ఇంటికి వ‌స్తున్న ప్ర‌తాప్ క‌న్ను ఆమెపై ప‌డింది. దీంతో వెంట‌నే అత‌ను ఓ కుటిల ఆలోచ‌న చేశాడు. టీనాను తాను రేప్ చేస్తాన‌ని అందుకు గాను ఆటో ఫైనాన్స్ చెల్లించాల్సిన ప‌ని లేద‌ని ఆమె మేన‌మామ‌కు ప్ర‌పోజ‌ల్ పెట్టాడు. అస‌లే క‌ష్టాల్లో ఉన్న అత‌ను అందుకు ఒప్పుకున్నాడు. అతని బిడ్డ కాదు క‌దా..! అందుకే అది ఓ దుర్మార్గ‌పు చ‌ర్య అయిన‌ప్ప‌టికీ దానికి అత‌ను ఒప్పుకున్నాడు. ఈ క్ర‌మంలో ప్ర‌తాప్ 3 ఏళ్ల పాటు టీనాను రేప్ చేస్తూనే వ‌చ్చాడు. ఆమె మాత్రం చిన్న వ‌య‌స్సు క‌దా. ఎవ‌రికి చెప్పుకోవాలో, ఏం చేయాలో కూడా తెలియ‌ని ఏజ్ అది. దీంతో టీనా మౌనంగా భ‌రించిందే త‌ప్ప ఎదురు తిర‌గ‌లేదు.

అప్ప‌టికి టీనాకు యుక్త వ‌య‌స్సు వ‌చ్చేసింది. మేజ‌ర్ అయింది. ఒక రోజు స్నేహితులు పిలిచిన ఓ ఫంక్ష‌న్‌కు వెళ్లింది. అక్క‌డే కృష్ణ అనే ఓ వ్య‌క్తి ఆమెను చూశాడు. వెంట‌నే ద‌గ్గ‌రికి వ‌చ్చి ల‌వ్ ప్ర‌పోజ్ చేశాడు. అవ‌కాశ‌మిస్తే పెళ్లి కూడా చేసుకుంటాన‌న్నాడు. అయితే టీనా అందుకు ఒప్పుకోలేదు స‌రి క‌దా, వెంట‌నే కృష్ణ చెంప ఛెళ్లుమ‌నిపించింది. ఒక్క నిమిషం అత‌నికి అర్థం కాలేదు. ఆ త‌రువాత టీనా చెబితేనే తెలిసింది, కృష్ణ ఎవ‌రో కాదు, ప్రతాప్ కొడుకు. దీంతో అస‌లు విషయం తెలుసుకున్న కృష్ణ‌కు టీనాపై మ‌రింత జాలి క‌లిగింది. ప్రేమ పెరిగింది త‌ప్ప త‌గ్గ‌లేదు. అయితే టీనా మాత్రం అత‌ని ప్రేమ‌ను నిరాక‌రిస్తూనే వ‌చ్చింది. ఈ క్రమంలో కృష్ణ ఏం చేశాడంటే టీనాను ఒప్పించి త‌న తండ్రిపై కేసు పెట్టేలా చేశాడు. దీంతో ప్ర‌తాప్‌కు, టీనా మేన‌మామ‌ల‌కు ఒక్కొక్క‌రికి 10 ఏళ్ల జైలు శిక్ష ప‌డింది. చివ‌రిగా కృష్ణ ప్రేమ‌ను టీనా అంగీక‌రించింది. దీంతో వారిద్ద‌రూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వారికి ఓ బాబు కూడా పుట్టాడు. అయితే టీనాతో పెళ్లికి మాత్రం కృష్ణ త‌ల్లి ఒప్పుకోలేదు. అయినా ఆమె అనుమ‌తితో ప‌నిలేద‌ని చెప్పి ఇద్ద‌రూ వేరే న‌గ‌రానికి వెళ్లి పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవ‌నం సాగిస్తున్నారు.

బ్ర‌తుకు దెరువు నిమిత్తం కృష్ణ చిన్న‌పాటి సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓపెన్ చేయ‌గా, అదిప్పుడు కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు చేరుకుంది. అయితే టీనా ఇప్ప‌టికీ త‌న జీవితంలో జ‌రిగిన ఆ చెడు సంఘ‌ట‌న‌ను మ‌రిచిపోలేదు. అప్పుడ‌ప్పుడు ట్రామాకు గుర‌వుతుంది. అయినా ఆమెను చంటిపాప‌లా చూసుకుంటున్నాడు కృష్ణ‌. ఏ దంప‌తుల‌కైనా కావల్సింది అంత‌కు మించి ఏముంటుంది చెప్పండి..!

పైన చెప్పింది ఊహాతీత, క‌ల్ప‌నాత్మ‌క‌మైన క‌థ కాదు. నిజంగా జ‌రిగిందే. య‌దార్థ గాథ‌. కానీ ఇప్పుడు ఆ దంప‌తుల ప్రైవ‌సీ, సెక్యూరిటీ దృష్ట్యా వారి పేర్ల‌ను మార్చి వారి క‌థ‌ను అందించ‌డం జ‌రిగింది..!

Comments

comments

Share this post

scroll to top