నలుగురు ఆ అమ్మాయిని 3 గంటలు రేప్ చేసారు..పోలీసులకు చెప్తే నమ్మలేదని ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా.?

మన దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలో నిర్భ‌య ఘ‌ట‌న జ‌రిగిన త‌రువాత అనేక క‌ఠిన‌మైన చ‌ట్టాల‌ను తెచ్చారు. తెచ్చామ‌ని నాయ‌కులు చెప్పారు. కానీ మ‌హిళ‌ల ప‌ట్ల జ‌రుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు ఆగ‌డం లేదు. పైగా బాధిత మ‌హిళ త‌న‌పై అత్యాచారం జ‌రిగింద‌ని మొర పెట్టుకున్నా చాలా వ‌ర‌కు ఘ‌ట‌న‌ల్లో పోలీసులు అప్ప‌టిక‌ప్పుడు స్పందించ‌డం లేదు. ఓ వైపు బాధిత మ‌హిళ త‌న‌పై దాడి జ‌రిగింద‌ని మొత్తుకున్నా అనేక సార్లు పోలీసులు నిర్ల‌క్ష్యం చేసిన దాఖలాలు ఉన్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కూడా స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. ఓ యువ‌తి త‌న‌పై అత్యాచారం జ‌రిగింద‌ని నెత్తీ నోరూ మొత్తుకుని మ‌రీ చెప్పింది. ఏకంగా 3 పోలీస్ స్టేష‌న్ల‌కు తిరిగింది. అయిన‌ప్ప‌టికీ పోలీసులు మాత్రం స‌కాలంలో స్పందించ లేదు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌లో ఓ యువ‌తి (19) ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ ప‌రీక్ష కోసం కోచింగ్ తీసుకుంటోంది. అదే క్ర‌మంలో ఇటీవ‌లే ఓ రోజున య‌థావిధిగా కోచింగ్ సెంట‌ర్ కు వెళ్లి మ‌ధ్యాహ్నం ఇంటికి వెనుదిరిగింది. అయితే మార్గ‌మ‌ధ్య‌లో వ‌చ్చిన ఓ ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద అప్ప‌టికే కాపు కాసిన న‌లుగురు వ్య‌క్తులు ఆ యువ‌తిపై దాడికి పాల్ప‌డ్డారు. ఆమెను ఫ్లై ఓవ‌ర్ కింద తాళ్లతో క‌ట్టేసి అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. అలా వారు 3 గంట‌ల పాటు ఆ రాక్ష‌స క్రీడ కొన‌సాగించారు. ఆ త‌రువాత ఎలాగో అక్క‌డి నుంచి ఆ యువ‌తి బ‌య‌ట ప‌డింది.

వెంట‌నే ఆ యువ‌తి స‌మీపంలో ఉన్న ఓ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి త‌న‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌ను వివ‌రించింది. అయితే పోలీసులు న‌మ్మ‌లేదు. అలా ఆమె మొత్తం 3 పోలీస్ స్టేష‌న్ల చుట్టూ తిరిగింది. అయిన‌ప్ప‌టికీ పోలీసులు ఎవ‌రూ కూడా ఆమె చెప్పింది విన‌లేదు, కంప్లెయింట్ తీసుకోలేదు. కాగా చివ‌ర‌కు ఆమె త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ర‌హ‌దారిపై వెళ్తుండ‌గా, ఆమెను రేప్ చేసిన న‌లుగురిలో ఇద్ద‌రు క‌నిపించారు. దీంతో వారిని తోటి వారి స‌హాయంతో ఆ యువ‌తి చేజ్ చేసి ప‌ట్టుకుంది. పోలీసుల‌కు అప్ప‌గించింది. అనంత‌రం పోలీసులు మిగిలిన ఇద్ద‌రినీ ప‌ట్టుకున్నారు. వారిని గోలు బిహారీ, అమ‌ర్ చంటు, రాజేష్, ర‌మేష్ గా గుర్తించారు. ఈ క్ర‌మంలో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. ఇలా ఉంది.. మ‌న దేశంలో పోలీసు వ్య‌వ‌స్థ‌… ఓ వైపు దాడి జ‌రిగింద‌ని నెత్తీ నోరు మొత్తుకున్నా ఆ పోలీసులు మొద‌ట విన‌లేదంటే.. ఇక మ‌నం వారిని ఏమ‌నాలో మీరే చెప్పండి..!

Comments

comments

Share this post

scroll to top