రేప్ గురైన మహిళ పోలీస్ స్టేషన్ కు వచ్చి పిర్యాదు చేస్తే…ఆమెకు అండగా ఉండాల్సిన పోలీసులు బాధ్యత మరిచి అడగకూడని ప్రశ్నలు అడిగిన ఘటన కేరళలో జరిగింది.! కేరళలోని త్రిసూర్ డిస్ట్రిక్ కు చెందిన ఓ మహిళ మీద ఆమె భర్త స్నేహితులు నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందులో అక్కడి లోకల్ లీడర్ కూడా ఉన్నడట…ఇదే విషయమై బాధిత మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసింది.
కంప్లైట్ ఇచ్చినప్పటి నుండి అటు అత్యాచారానికి ఒడిగట్టిన వారినుండి, ఇటు పోలీసుల నుండి సదరు మహిళకు అనేక బెదిరింపులు ఎదురవుతున్నాయట… అత్యాచార మహిళను పట్టుకొని….”నిన్ను రేప్ చేసిన నలుగురిలో ఎవడు నిన్ను బాగా సుఖపెట్టాడు” అని ఓ పోలీస్ ఆఫీసర్ అందరిముందు అడిగాడట.! కోర్ట్ లో నిజం చెబితే చంపేస్తామని కూడా ఆమెను బెదిరిస్తున్నారట. మళయాళం డబ్బింగ్ ఆర్టిస్ట్…భాగ్యలక్ష్మీ ఈ ఘటన గురించి వివరంగా తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు..రాజకీయ నాయకులకు అండగా ఉంటూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కొంతమంది నెటీజన్లు…బాధిత మహిళకు సపోర్ట్ చేస్తున్నారు. అయినా ఓ పోలీస్ అధికారి…ఓ మహిళను పట్టుకొని ఇలాంటి ప్రశ్న అడగడం ఎంత వరకు సబబు?