కత్తి మహేశ్ పై కోడిగుడ్ల‌ దాడి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ దిష్టిబొమ్మ‌ల ద‌గ్ధానికి విద్యార్థి సంఘాల పిలుపు.!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి,కత్తి మహేశ్ కి మధ్య జరుగుతున్న వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది.ఇన్ని రోజులు కత్తిపై బూతులతో మాటల యుద్దం జరిపిన పవన్ ఫ్యాన్స్  ఈ రోజు దాడికి తెగబడ్డారు..ఒక న్యూస్ ఛానెల్ లో లైవ్ షో ముగించుకుని క్యాబ్ లో ఇంటికి వెళ్తున్న కత్తి మహేశ్ పై పవన్ ఫ్యాన్స్ కోడి గుడ్లతో దాడి చేశారు.మరో వైపు ఈ దాడిని ఖండిస్తూ పవన్ దిష్టి బొమ్మ దగ్దం చేయాలని కొన్ని సంఘాలు పిలుపునిచ్చాయి…

హైదరాబాద్ లోని శిల్పారామం దగ్గర క్యాబ్ లో వెళ్తున్న కత్తి మహేశ్ పై బైక్ మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేసి పరారయ్యారు. ఇంతకు ముందు పూనమ్ కౌర్ ని సవాల్ చేస్తూ కత్తి  ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పవన్ ఫ్యాన్స్ కత్తి పై దాడికి దిగారు..ఆ తర్వాత కూడా అతడి వెహికిల్ ని వెంబడిస్తూ బూతులు తిట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి..ఇప్పుడు డైరెక్ట్ గా అటాక్ చేయడం ..దీనికంతటికి పవన్ కళ్యాణే కారణమని..పవన్ మౌనమే కారణమని కత్తి మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు రేపు తెలంగాణా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్  దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని ఓయు విధ్యార్దులు పిలుపునిచ్చారు..

Comments

comments

Share this post

scroll to top