ఉగ్ర‌మూక‌ల పంజా..ర‌క్త‌మోడిన కొలంబో

ఉగ్ర మూక‌లు మ‌రింత రెచ్చి పోయాయి. శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబోలో ఒక్క‌సారిగా భారీ శ‌బ్దాల‌తో న‌గ‌రం ద‌ద్ద‌రిల్లి పోయింది. ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో చ‌ర్చీలలో ప్రార్థ‌న‌లు చేసుకుంటున్న వారే ల‌క్ష్యంగా ఈ దాడులు వెంట‌వెంట‌నే కొన‌సాగాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 130 మందికి పైగా చ‌నిపోగా ఇంకా ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో కొలిక్కి రాలేదు. మూడు చ‌ర్చీలు, మూడు హోట‌ళ్ల‌లో ఈ పేలుళ్లు జ‌రిగాయి. భారీ పేలుళ్లు చ‌ర్చీల‌ను టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఆక‌స్మిక దాడుల దెబ్బ‌కు శ్రీ‌లంక ఒక్క‌సారిగా కుదుపున‌కు లోనైంది. ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యానికి కూత‌వేటు దూరంలో ఉన్న హోట‌ల్‌లో బాంబులు పేలాయి. ఈస్ట‌ర్ పండుగ సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

చాలా మంది చ‌ర్చీల‌లో ప్రార్థ‌నలు చేశారు. ప్రశాంత వాతార‌ణం నెల‌కొన్న స‌మ‌యంలో బాంబులు పేల‌డంతో జ‌నం భ‌యంతో ప‌రుగులు తీశారు. బాంబు పేలుళ్ల దుర్ఘ‌ట‌న దుర్వార్త దావాన‌లంలా వ్యాపించ‌డంతో ..ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయా దేశాలు రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించాయి. ఇండియా, పాకిస్తాన్, చైనా, అమెరికా, ఇంగ్లండ్ , ర‌ష్యా దేశాల అధిప‌తులు తీవ్ర దిగ్భ్రాంతిని ప్ర‌క‌టించారు. ఈ దుర్ఘ‌ట‌న నుంచి శ్రీ‌లంక త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ..ఏ సాయ‌మైనా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ప‌లు దేశాధినేత‌లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ ఘ‌ట‌న‌లో మృతిచెందిన కుటుంబాలకు శాంతి చేకూరాల‌ని, క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాక్షించారు. ఇక ఇండియా ఉగ్ర మూకల దాడుల‌ను తీవ్రంగా ఖండించింది. భార‌త విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

బాంబు పేలుళ్లలో ఇండియ‌న్స్ ఎవ‌రైనా ఉన్నారా అన్న అంశంపై ఆరా తీస్తున్నామ‌ని..ఈ మేర‌కు భార‌త రాయ‌బార కార్యాల‌యాన్ని సంప్ర‌దించారు. ఉద‌యం ఆరు చోట్ల బాంబు దాడులు జ‌రిగాయి. చ‌ర్చిలు, హోట‌ళ్లే టార్గెట్ చేశారు. ఇప్ప‌టికే ఎల్‌టిటిఇ పూర్తిగా క‌నుమ‌రుగైంది. ఇది ఉగ్ర‌వాదుల పిరికిపంద చ‌ర్య‌గా పేర్కొన్నారు. శ్రీ‌లంక‌లో హై అల‌ర్ట్ విధించారు. ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ఈస్ట‌ర్ పండుగ సంద‌ర్భంగా దాడులు జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వం దీనిని సీరియ‌స్ గా తీసుకోక పోవ‌డంతో ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్నాయ‌ని స‌మాచారం. క్రైస్త‌వుల‌కు ప‌విత్ర‌మైన పండుగ రోజు ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ..హోట‌ళ్ల‌లో విదేశీయులు బ‌స చేయ‌డాన్ని ఉగ్ర వాదులు టార్గెట్ చేశారు. 300 మందికి పైగా ఈ దాడుల్లో గాయ‌ప‌డ్డారు. బాధితుల‌ను హుటాహుటిన ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. శ్రీ‌లంక ప్ర‌భుత్వం దేశంలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. పూర్తిగా ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపి వేశారు. ఉగ్ర‌వాదులు ఒకే మ‌తానికి చెందిన వారిని ప్ర‌త్యేకంగా టార్గెట్ చేసిన‌ట్టు అంచ‌నా.

ఆరు ప్ర‌దేశాల‌లో బాంబు పేలుళ్లు జ‌రిగాయ‌ని పోలీసులు తెలిపారు. మృత‌దేహాలు చెల్లా చెదురుగా ప‌డి పోయాయి. ఆ ప్రాంతాల‌న్నీ ర‌క్తంతో త‌డిసి పోయాయి. ఇదే రోజు క్రైస్త‌వులు అంతా వ‌స్తార‌ని ..ఒక ప్లాన్ ప్ర‌కారం చేసిన‌ట్లు భావిస్తున్నారు. ఈ పేలుళ్ల‌ను ఏ సంస్థ ఓన్ చేసుకోలేదు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.45 ప్రాంతంలో కొలంబోలోని ఒక చర్చితోపాటు మూడు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో బాంబులు పేలాయి. కొలంబోలోని సెయింట్‌ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్‌ సెబాస్టియన్‌, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా, సిన్నామన్‌ గ్రాండ్‌, కింగ్స్‌బరి హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే అత్యవసర సమాచారం నిర్వహించారు. ఇప్ప‌టి దాకా ఏ సంస్థ ఈ దారుణానికి పాల్ప‌డిందో తేల్చ‌లేదు. చ‌ర్చీల‌న్నీ రోద‌న‌ల‌తో నిండి పోయాయి. స‌హాయ‌క సిబ్బంది క్ష‌త‌గాత్రుల‌ను త‌ర‌లించారు. భారీ ప్రాణ న‌ష్టం ఏర్ప‌డింది. విదేశీ టూరిస్టుల‌తో పాటు క్రిష్టియ‌న్ల‌ను టార్గెట్ చేసుకుని ఈ పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారు.

Comments

comments

Share this post

scroll to top