హీరోయిన్ త‌మన్నాపై చెప్పుతో దాడి చేసిన యువ‌కుడు.. ఫ్రెండ్స్ తో చెప్పుకొని బాధ‌ప‌డుతున్న త‌మ‌న్నా.!?

ఈ మద్య సినిమా వారిపై,రాజకీయనాయకులపై చెప్పుల దాడి ఎక్కువైంది..మొన్నటికి మొన్న పవన్ పై ఒకరు చెప్పు విసిరితే నేడు మిల్కీ బ్యూటీ తమన్నాకు అదే చేదు అనుభవం ఎదురైంది..హైదరాబాద్ లో  ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా   వచ్చిన ఆమెపై ఓ ఆకతాయి యువకుడు చెప్పు విసరడంతో కలకలం రేగింది.దీంతో తమన్నాతో పాటు అక్కడున్నవారందరూ షాక్ అయ్యారు…వివరాలు

హిమాయత్‌నగర్‌లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్  ప్రారంభానికి హాజరయింది తమన్నా.ఆ కార్యక్రమంలో  తమన్నాపై  ఓ యువకుడు చెప్పువిసిరాడు..  ఈ హఠాత్పరిణామానికి తమన్నాతో పాటు అక్కడున్న అందరూ షాక్‌కు గురయ్యారు. . చెప్పు విసిరిన ఆకతాయి కరీముద్దిన్,బిటెక్ చదివే విద్యార్ధిగా నారాయణగూడ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.   పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నిందితుడు కరీముద్దీన్‌ వారితో  కూడా వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు పక్కనే ఉన్నవారిపై సైతం వాదించినట్లు వీడియోలో రికార్డయ్యింది.

ఇంతకీ ఆ యువకుడు తమన్నాపై ఎందుకు చెప్పుదాడి చేసాడనే  కారణాలు తెలియలేదు..జరిగిన సంఘటనను తన సన్నిహితులతో చెప్పుకుని బాదపడుతుందట తమన్నా..తమన్నా, విక్రమ్‌ నటించిన స్కెచ్ చిత్రం ఇటీవల తమిళంలో విడుదలై విజయం అందుకుంది. ప్రస్తుతం నీలకంఠరెడ్డి దర్శకత్వంలో  ‘క్వీన్‌’రీమేక్‌లో నటిస్తుంది తమన్నా. . మరోపక్క కల్యాణ్‌రామ్‌తో ‘నా నువ్వే’ అనే సినిమాలోనూ తమన్నా కథానాయికగా నటిస్తోంది. జయేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top