ఏటీఎం కార్డు పిన్ నంబ‌ర్ మ‌ర్చిపోయారా ? బ్యాంకు కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ 6 స్టెప్స్ ఫాలో అవ్వండి.!

నేటి త‌రుణంలో క్రెడిట్ కార్డులు ఏమోగానీ డెబిట్ కార్డులు మాత్రం అనేక మంది వ‌ద్ద ఉంటున్నాయి. ప్ర‌తి ఒక్క‌రికి బ్యాంక్ అకౌంట్ ఉండ‌డం వ‌ల్ల ఏటీఎంలు అనేవి చాలా మంది చేతుల్లో క‌నిపిస్తున్నాయి. దీంతో వాటి ద్వారా అనేక ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకుంటున్నారు. చేతిలో క్యాష్ లేక‌పోయినా కార్డును స్వైప్ చేస్తూ వాటి ద్వారా ప‌నులు చేసుకుంటున్నారు. అయితే ఏటీఎంలో క్యాష్ తీయాల‌న్నా, కార్డు స్వైప్ చేయాల‌న్నా పిన్ నంబ‌ర్ త‌ప్ప‌నిస‌రి. అది లేక‌పోతే ఆ ప‌నులు సాధ్యం కావు. ఇదంతా బాగానే ఉంది. కానీ పిన్ నంబ‌ర్‌ను మ‌ర్చిపోతే ? అప్పుడెలా ? అంటే.. అందుకు దిగులు చెందాల్సిన ప‌నిలేదు. కింద చెప్పిన పలు స్టెప్స్‌ను ఫాలో అయిపొండి. దీంతో మీరు మీ ఏటీఎం కార్డుకు కొత్త నంబ‌ర్‌ను సెట్ చేసుకోగ‌లుగుతారు. తిరిగి ఎప్ప‌టిలాగే కార్డును వాడుకునేందుకు వీలుంటుంది. మ‌రి ఏటీఎం పిన్ నంబ‌ర్‌ను కొత్త‌గా సెట్ చేసుకోవ‌డం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఏటీఎం పిన్ సెట్ చేసుకోవ‌డానికి మీకు కావలసినవి…
1. ATM కార్డ్
2. బ్యాంక్ ఎకౌంట్ నెంబర్
3. మీ బ్యాంక్ ఎకౌంట్ కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ (ఆ నంబ‌ర్ మీ వ‌ద్దే ఫోన్‌లో ఉండాలి)

పైన మూడు అందుబాటులో ఉంటే మీరు మీకు దగ్గరలోని మీ బ్యాంక్ ATM సెంటర్ లోకి వెళ్లి కార్డును ఏటీఎంలో పెట్టాలి. త‌రువాత కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వాలి.

* మొద‌ట‌గా Banking అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి.
* Pin Generate లేదా ATM Pin reset అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి.
* మీ Account Number ని ఎంటర్ చేయాలి.
* మీ Phone number ని ఎంటర్ చేయాలి.
* మీ ఫోన్ కి OTP (One Time Password) వస్తుంది.
* OTP ని ఎంటర్ చేసి మీ పిన్ నంబర్ ని మార్చితే సరిపోతుంది. పాత పిన్ తొలగిపోయి కొత్త పిన్ యాక్టివేట్ అవుతుంది.

Comments

comments

Share this post

scroll to top