ATM విత్ డ్రా లిమిట్ ను 50 వేల‌కు పెంచిన RBI!

నవంబర్ 8 న మొదలయ్యాయి మన “నోటు కష్టాలు”.. పెద్ద నోట్లు బాన్ అయ్యి, చిల్లర దొరక్క మనందరికీ చుక్కలు కనిపించాయి. కాకపోతే కొత్త 500 రూపాయల నోట్లు త్వరలోనే పెద్ద మొత్తంలో అమలులోకి రావడం మనకి కొద్దిగా ఊరటనిచ్చింది. మొదట్లో రోజుకి 2000 రూపాయలు మాత్రమే ATM నుండి తీసుకోడానికి వచ్చేది. తరవాత పది వేలుకి పెంచారు. ఇప్పుడు రోజుకి 24000 వరకు మనం ATM నుండి తీసుకోవచ్చు!..కానీ వారానికి కూడా మనకి అదే లిమిట్ ఉంది.

కానీ ఇప్పుడు RBI వార పరిమితిని 50000కి పెంచింది. రోజు పరిమితి మాత్రం 24000 నిర్దారించింది!. ఈ కొత్త పరిమితి ఈ నెల 20 వ తేదీ నుండి అమలులోకి వస్తుంది అని అధికారికంగా ప్రకటించింది RBI. అయితే మార్చ్ 3 వ తేదీ నుండి నగదు ఉపసంహరణలో ఎటువంటి పరిమితి ఉండదు అని కూడా ప్రకటించి ఊరట కలిగించింది. ఇక వచ్చే నెల 3 నుండి మనం మునపటి రోజుల లాగా లావాదేవీలు కొనసాగించుకోవచ్చు అన్నమాట!.. సేవింగ్స్ ఖాతా నుండి నగదు ఉపసంహరణపై ఎటువంటి పరిమితి ఉండబోదు!

Comments

comments

Share this post

scroll to top