ఏప్రిల్ 1 నుంచి ప్ర‌ధాన బ్యాంకులు వ‌సూలు చేయ‌నున్న ఏటీఎం చార్జిలివే..!

నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో మొన్నా మ‌ధ్య వ‌ర‌కు జ‌నాలు బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఇప్పుడా క‌ష్టాలు దూర‌మ‌య్యాయి. కానీ… ఏప్రిల్ 1 నుంచి కొత్త చిక్కులు ఎదురు కానున్నాయి. అదేనండీ… బ్యాంక్ అకౌంట్ల‌లో మినిమం బ్యాలెన్స్ ఉంచ‌క‌పోయినా, న‌గ‌దు విత్ డ్రాలు ఎక్కువ‌గా చేసినా, ఏటీఎంలు ఎడా పెడా వాడినా… ఇక‌పై బ్యాంకులు వీర బాదుడుకు సిద్ధం అయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాల‌ని ఇప్ప‌టికే ఎస్‌బీఐ స‌హా ప‌లు ప్ర‌ధాన ప్రైవేటు బ్యాంకులు సిద్ధ‌మ‌య్యాయిగా. ఇప్పుడీ విష‌యం దేశంలో హాట్ టాపిక్ మారింది. చాలా మంది బ్యాంకుల నిర్ణయాన్ని వ్య‌తిరేకిస్తూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున నో ట్రాన్సాక్ష‌న్ డేకు పిలుపునిస్తున్నారు. ఇదంతా పక్క‌న పెడితే అస‌లు ఏటీఎంల‌లో ప్ర‌ధాన బ్యాంకులు చార్జిల‌ను ఎలా వ‌సూలు చేయ‌నున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

sbi-atm
ఎస్‌బీఐ…
ఎస్‌బీఐ బ్యాంకు ఏటీఎం ద్వారా ఎవ‌రైనా నెల‌కు 5 ట్రాన్సాక్ష‌న్లు ఉచితంగా చేసుకోవ‌చ్చు. అయితే ఆ 5 ట్రాన్సాక్ష‌న్ల‌లో హోం బ్యాంకు ఏటీఎం నుంచి 3, ఇత‌ర బ్యాంకు ఏటీఎంల నుంచి 2 ట్రాన్సాక్ష‌న్ల వ‌ర‌కు మాత్ర‌మే ఉచితం. ఆపైన జ‌రిపే ప్ర‌తి లావాదేవీకి రూ.10 చార్జి అవుతుంది.  ఈ క్ర‌మంలో  ఎవ‌రైనా హోం బ్యాంకు ద్వారా 5 వ‌ర‌కు లావాదావీల‌ను ఉచితంగా జ‌ర‌ప‌వ‌చ్చు. అయితే ఇత‌ర బ్యాంకుల ఏటీఎంల‌లో మాత్రం 2 లావాదేవీల‌కే ప‌రిమితం. 2 లావాదేవీలు దాటాక ఇంకా మూడు లావాదేవీలు ఉన్నాయి క‌దా, వాడుదామంటే కుద‌ర‌దు, రూ.10 వ‌ర‌కు ఫైన్ ప‌డుతుంది.

hdfc-atm
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు…
ఈ బ్యాంకు కూడా ఎస్‌బీఐ లాగే 5 లావాదేవీల‌కు ఫ్రీగా అనుమ‌తి ఇస్తోంది. కానీ అవి దాటితే మాత్రం ఎస్‌బీఐ లా కాదు. రూ.20 వ‌ర‌కు చార్జి ప‌డుతుంది. మొత్తం 5 లావాదేవీల్లో హోం బ్యాంకు ఏటీఎంల‌లో 3, ఇత‌ర బ్యాంకుల ఏటీఎంల‌లో 2 లావాదేవీల‌ను ఉచితంగా జ‌ర‌ప‌వ‌చ్చు. అవి దాటితే ముందు చెప్పిన విధంగా చార్జి ప‌డుతుంది.

ఐసీఐసీఐ బ్యాంకు…
ఈ బ్యాంకు ద్వారా కూడా 5 లావాదేవీలు ఉచితం. హోం బ్యాంకు ఏటీఎంల‌లో 3, ఇత‌ర బ్యాంకుల ఏటీఎంల‌లో 2 ఉచిత లావాదేవీలు జ‌ర‌ప‌వ‌చ్చు. అవి దాటితే రూ.20 చార్జి ప‌డుతుంది.

icici-atm
యాక్సిస్ బ్యాంకు…
హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు అమ‌లు చేయనున్న నిబంధ‌న‌ల‌నే యాక్సిస్ బ్యాంకు కూడా అమ‌లు చేయ‌నుంది. ఈ బ్యాంకు కూడా 5 లావాదేవీలు దాటితే రూ.20 వ‌ర‌కు చార్జి వసూలు చేయ‌నుంది. హోం బ్యాంకు ఏటీఎంల ద్వారా 3, ఇత‌ర బ్యాంకుల ఏటీఎంల ద్వారా 2 లావాదేవీలు మాత్ర‌మే జ‌ర‌ప‌వ‌చ్చు.

ఇక‌పోతే మిగిలిన బ్యాంకులు కూడా ఈ బ్యాంకుల‌లాగే ఏటీఎం చార్జిల బాదుడుకు రంగం సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. అది తెలియాలంటే మ‌రికొద్ది రోజులు వేచి చూడ‌క త‌ప్ప‌దు. ఏది ఏమైనా ఏప్రిల్ 1 నుంచి మాత్రం ఏటీఎంల‌ను వాడితే జ‌ర జాగ్ర‌త్త‌. ఎందుకంటే రూ.100కు, రూ.200కు ప‌దే ప‌దే ఏటీఎంల‌కు వెళ్తే ఫ్రీ లావాదేవీలు అయిపోయి ఆ త‌రువాత అన‌వ‌స‌రంగా చార్జిలు భ‌రించాల్సి ఉంటుంది. అయితే మ‌రి మ‌నం జ‌రిపే ఆ 5 ఫ్రీ లావాదేవీల్లో ఎంతంటే అంత డ‌బ్బు తీసుకోవ‌చ్చా..? అంటే.. ఉహు.. అది కుద‌ర‌దు. వారానికి కేవ‌లం రూ.50వేల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తార‌ట‌. కాబ‌ట్టి త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!

Comments

comments

Share this post

scroll to top