మన దేశంలో అత్యధిక జీతాలు అందుకునే 10 ఉద్యోగాలు ఇవే.! ఎవరికెన్ని లక్షల్లో వివరాలు చూడండి!

ఉద్యోగం పురుషలక్షణం అన్నారు కానీ నేడు స్త్రీలు కూడా పురుషులతో పోటి పడి అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారు..ప్రతి ఒక్కరికి కెరీర్ గురించి ఆలోచనే..ఉద్యోగంలో స్థిరపడడానికి,మంచి ఉద్యోగంలో స్థిరపడడానికి తేడా ఉందంటారు..మంచి ఉద్యోగం అంటే కొందరి దృష్టిలో తాము చేసే పని పట్ల తమకు ఉన్న ఇష్టం ద్వారా చేసేదైతే..మరికొందరికి ఎక్కువ జీతం రావడమే మంచి ఉద్యోగం..ఆ విధంగా మన దేశంలో ఎక్కువ జీతం ఇచ్చే పది ఉద్యోగాలు ఏంటో తెలుసా..?

స్టాటిస్టిక‌ల్ అన‌లిస్టులు(గ‌ణాంక నిపుణులు):

డేటా అన‌లిస్టుల్లాంటివే స్టాటిస్టికల్ అలనలిస్ట్స్. బిజినెస్ ఇంటెలిజెన్స్‌కు ప్రాముఖ్యం పెరుగుతున్న నేటి రోజుల్లో వీరి అవ‌సరం పెరుగుతోంది. స‌మాచారాన్నంతా సేక‌రించి, విశ్లేషించి దాన్ని విభ‌జించి సులువుగా అర్థ‌మ‌య్యేలా వివిధ చిత్రాల సాయంతో ప్రెజెంట్ చేయాల్సిన బాధ్య‌త స్టాటిస్టికల్ అనలిస్టులదే. ఇందుకోసం వెన్‌చిత్రాలు, రేఖా చిత్రాలు, గ్రాఫ్‌లు వంటి వాటి సాయం తీసుకుంటారు. ఇలాంటి ఉద్యోగాల కోసం డిగ్రీ అర్హ‌త ఉంటే చాలు.

జీతం నెల‌కు రూ. 50 వేల నుంచి రూ. 4 లక్ష‌ల వ‌ర‌కూ ఉంటుంది.

స్పేస్ సైంటిస్టులు:

స్పేస్(అంత‌రిక్షం) గురించిన ప‌రిశోధ‌న‌లు పెరుగుతూ ఉన్నాయి.. అయితే ఈ ఉద్యోగాలు ఎక్కువ‌గా ప్ర‌భుత్వ‌మే క‌ల్పిస్తుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూస్తే ఈ రంగంలోని వ్య‌క్తులు మంచి వేత‌నాలు అందుకుంటున్నారు. ఈ ఉద్యోగాల కోసం సైన్స్ రంగంలో డాక్ట‌రేట్ లేదా పోస్ట్ డాక్ట‌రేట్ క‌లిగి ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

జీత‌ం నెల‌కు రూ. 80 వేల నుంచి రూ. 3 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉండొచ్చు.

డాక్ట‌ర్లు(వైద్య వృత్తి):

మ‌నం ఎలాంటి విత్తనం వేస్తామో అలాంటి పంటే మ‌న చేతికి వ‌స్తుందే అనేది పురాత‌న సామెత‌. దానికి డాక్ట‌ర్లు ఉత్త‌మ ఉదాహ‌ర‌ణ‌. ఏదో ఒక స్పెష‌లైజేష‌న్ పూర్తి చేసిన క‌న్స‌ల్టెంటుగా మారాలంటే క‌నీసం 8 నుంచి 10 సంవత్స‌రాలు ప‌డుతుంది. సూప‌ర్ స్పెష‌లైజేష‌న్ పూర్తి చేసేందుకు ఇంకా ఎక్కువ స‌మ‌యం కూడా ప‌ట్టొచ్చు. చేతిలో క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న ప‌ట్టాల‌కు ఎక్కువ డ‌బ్బు సంపాదించే వారిలో ఈ వృత్తి కూడా ఒక‌టి. క‌నీస అర్హ‌త ఎంబీబీఎస్ ఉండాలి.

జీతం నెల‌కు రూ. 43 వేల నుంచి రూ. 6 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటుంది. (స్పెష‌లైజేష‌న్ బట్టి)

యాప్ డెవ‌ల‌ప‌ర్‌:

ప్ర‌స్తుత‌మంతా ఇంట‌ర్నెట్ యుగం న‌డుస్తోంది. ప్ర‌తి చిన్న ప‌నికీ వెబ్‌సైట్లు, యాప్‌లు వ‌స్తున్నాయి. పేరెన్నిక‌గ‌న్న సంస్థ‌లు మొబైల్ అప్లికేష‌న్ల‌ను విడుద‌ల చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నాయి. యాప్‌డెవ‌ల‌ప‌ర్ చేయాల్సిన ప‌ని మంచి యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ ఉండేలా యాప్‌ల‌ను అభివృద్ది చేయ‌డం. కొన్ని బ్రాండ్లు కేవ‌లం మొబైల్ సైట్ల‌లోనే ల‌భ్య‌మ‌వుతున్నాయి. మరికొన్ని ఈ-కామ‌ర్స్ సైట్లు కేవ‌లం యాప్‌ల ద్వారానే వ్యాపారం చేస్తున్నారు. మొబైల్ ఆధారిత యాప్ డెవ‌ల‌ప‌ర్లు ఇటువంటి యాప్‌ల‌కు ప్రాణం పోస్తారు. ఈ ఉద్యోగాల కోసం క‌నీసం డిగ్రీ పూర్తి చేసి ఉంటే చాలు. అయితే యాప్ డెవ‌ల‌ప్‌మెంట్లో ఏదైనా కోర్సు చేసి ఉండాలి.

క‌నీస వేత‌నం నెల‌కు రూ. 25 వేల నుంచి రూ. 5 లక్ష‌ల వ‌ర‌కూ ఉంటోంది

పైలెట్లు:

ఆకాశంలో ఎగిరే విమానాల్లో ప్ర‌యాణించాల‌నే ఆత్రుత ఎంతోమందికి ఉంటుంది. అలాంటి విమానాల‌ను న‌డిపే జాబ్ అంటే ఇంకెంత ఉత్సాహంగా ఉంటుందో ఊహించండి. పైలెట్ ఉద్యోగం చేసే వారికి చాలా సానుకూల‌త‌లు ఉంటాయి. భార‌త‌దేశంలో పైలెట్ల‌కు ఎక్కువ వేత‌నాలు ఇవ్వ‌డంతో పాటు చాలా అద‌న‌పు సౌక‌ర్యాలు క‌ల్పిస్తారు. ఇంట‌ర్మీడియ‌ట్ త‌ర్వాత పైలెట్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మం పూర్తిచేయ‌డం ద్వారా ఈ ఉద్యోగాల‌కు అర్హ‌త సాధించ‌వ‌చ్చు.

క‌నీస వేత‌నం నెల‌కు రూ. 1.5 ల‌క్ష నుంచి రూ. 3 లక్ష‌ల వ‌ర‌కూ ఉంటుంది.

ప్రొఫెస‌ర్లు:

సాఫ్ట్‌వేర్ రంగం పుంజుకున్న ద‌గ్గ‌ర నుంచీ ముఖ్యంగా సైన్స్, ఇంజినీరింగ్ రంగాల్లో టీచింగ్ వైపు వెళ్లేవారు త‌క్కువ‌య్యారు. అక‌డ‌మిక్స్ వైపు వెళ్లాలంటే ఎంతో స‌హ‌నం, వృత్తి నైపుణ్యంతో పాటు ఏదో సాధించాల‌నే ప‌ట్టుద‌ల ఉండాలి. ఎందుకంటే ఏ వృత్తి నిపుణుడిన‌యినా త‌యారుచేసేది టీచింగ్ ప్రొఫెష‌న్లో ఉన్నోళ్లే క‌దా. ప్రొఫెస‌ర్ కావాలంటే క‌నీసం ఎం.ఫిల్ లేదా డాక్ట‌రేట్ ఉండాలి. మాస్ట‌ర్స్ డిగ్రీ పూర్తి చేసి అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా మొద‌లుపెట్టవ‌చ్చు. త‌ర్వాత నెమ్మ‌దిగా పీ.హెచ్‌డీ చేస్తూ ప్రొఫెస‌ర్‌గా స్థిర‌ప‌డొచ్చు. దేశంలో చాలా విశ్వ‌విద్యాల‌యాలు పీ.హెచ్‌.డీ చేసుకుంటూనే డిగ్రీ స్థాయి వారికి పాఠాలు చెప్పేందుకు వీలును క‌ల్పిస్తున్నాయి.

క‌నీస వేత‌నాలు రూ. 40 వేల నుంచి రూ. 4 లక్ష‌ల వ‌ర‌కూ ఉంటుంది.

ఎస్ఈవో అనలిస్టులు:

 గూగుల్లో ఏదన్నా సెర్చ్ చేస్తున్నప్పుడు దానికి సంభందించిన ఆయా వెబ్సైట్ల లింక్ లు వచ్చేలా చేయడం ఎస్ ఈవోల పని. స్టార్ట‌ప్‌లు ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరుగుతున్న ఈ రోజుల్లో టెక్ కంపెనీల‌న్నీ ఎస్ఈవో విశ్లేష‌ణ‌పై దృష్టి పెడుతున్నాయి.సోష‌ల్ మీడియా, గ్రోత్ హ్యాక‌ర్లు చేసే ప‌ని కంటే కాస్త ఎక్కువ‌గా పైస్థాయిలో జ‌రిగే ప‌నిని ఎస్ఈవో అన‌లిస్టులు చేస్తారు.  మీడియా, ప‌రిశోధ‌న‌, ఫార్మా, పుస్త‌క‌ర‌చ‌న‌, ఐటీ వంటి చాలా సంస్థ‌ల్లో ఎస్ఈవోల తోడ్పాటు అధికంగా అవ‌స‌ర‌మ‌వుతుంది.క‌నీసం గ్రాడ్యుయేష‌న్‌తో ఈ ఉద్యోగాలు సాధించ‌వ‌చ్చు. కావాల్సింద‌ల్లా సబ్జెక్టు మీద ప‌ట్టు, ఆస‌క్తి.

వేతనం నెల‌కు క‌నీసం రూ. 30 వేల నుంచి మొద‌లుకొని రూ.1 ల‌క్ష వ‌ర‌కూ ఉంటున్నాయి. 

సోష‌ల్ మీడియా మేనేజ‌ర్:

ఏదైనా బ్రాండ్‌కు వెబ్‌సైట్ ద్వారా ప్రాచుర్యం క‌ల్పించ‌డంలో సోష‌ల్ మీడియా పాత్ర ఎన‌లేనిది. ఇప్పుడు ఈ రంగంలో ఉన్న చాలా మందికి 10 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ అనుభ‌వం ఉంది. వారంతా బ్రాండ్ల‌కు సోష‌ల్ మీడియాలో పేరు తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నారు. వీరికి కంపెనీల్లో ప్ర‌త్యేక గౌర‌వం ఉంటుంది. ఈ ఉద్యోగాల‌కు క‌నీస అర్హ‌త ఏదైనా డిగ్రీ. వేత‌నం నెల‌కు రూ. 30 వేలు మొద‌లుకొని రూ. 3 లక్ష‌ల వ‌ర‌కూ ఆఫ‌ర్ చేసే సంస్థ‌లున్నాయి.

 రిలేష‌న్ షిప్ థెరపిస్టులు:

వీరి ప‌నంతా ఉద్యోగంలో స‌హ‌చ‌రులు, స‌బ్ ఆర్డినేట్లు, మేనేజ్‌మెంటుతో ఎలా మ‌స‌లుకోవాలో ప్ర‌తి ఉద్యోగికి వివ‌రించ‌డం. వృత్తి, ఉద్యోగాలు, వ్య‌క్తిగ‌త జీవితాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఎలా సాధించాలో వీరు నేర్పుతారు. క‌నీస అర్హ‌త డిగ్రీతో ఈ ఉద్యోగాల‌ను సాధించ‌వ‌చ్చు. ఎంబీఏ క‌లిగి ఉండ‌టం అద‌న‌పు అడ్వాంటేజ్‌. ఎం.ఏ(ప‌బ్లిక్ రిలేష‌న్స్‌) చ‌దివిన వారు సైతం ఈ ర‌క‌మైన ఉద్యోగాలకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. పాశ్చాత్య దేశాల్లో ఇది రెగ్యుల‌ర్ ప్రొఫెష‌న్‌. ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈ త‌ర‌హా ఉద్యోగాల‌కు ప్రాముఖ్య‌త పెరుగుతోంది.

వేత‌నం నెల‌కు రూ. 30 వేలు మొద‌లుకుని గ‌రిష్టంగా రూ. 1 ల‌క్ష వ‌ర‌కూ ఉంటుంది.

టెక్నిక‌ల్ రైట‌ర్లు:

టెక్నికల్ రైటర్లంటే కేవ‌లం రాయ‌ట‌మే కాదు, సాంకేతికంగా ఒక సంస్థ‌కు లేదా ప్రొగ్రామింగ్ కంపెనీకి చెందిన అంశాల‌పై వారు ప‌ట్టు సాధించి ఉండాలి. అడోబ్‌, ఒరాకిల్‌, బిగ్‌డేటా, హ‌డూప్‌, శ్యాప్ లాంటి వాటికి సంబంధించిన అంశాల‌పై రాయాలంటే సాంకేతిక ప‌ద‌జాలంపై అవ‌గాహ‌న ఉండాలి. ఏదైనా డిగ్రీ ఉండి, సాంకేతిక ప‌ద‌జాలంపై ప‌ట్టు ఉంటే ఉద్యోగం చేయ‌వ‌చ్చు.మిగిలిన ఉద్యోగాల్లో లాగా ఒక నిర్ణీత ప‌నివేళల్లో ప‌నిచేస్తే ప‌రిపోదు. నిరంత‌రం కొత్త అంశాల కోసం అన్వేషిస్తూ, పాఠ‌కుల(టార్గెట్ ఆడియ‌న్స్‌) కోసం స‌రిప‌డా స‌మాచారాన్ని సేక‌రించే ప‌నిలో ఉండాలి.

వేత‌నం నెల‌కు . 50 వేల నుంచి రూ. 1.7 లక్షల వ‌ర‌కూ ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top