ఇవాంక వల్ల హైదరాబాద్ లోని ఆ హోటల్ రూమ్ బాయ్ జీవితమే మారిపోయిందట..! అసలేమైంది.?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ జీఈఎస్ 2017 సమ్మిట్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చి వెళ్లిన విషయం తెలిసింది.తొలుత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయినప్పటి నుండి ఆమె తన అనుభవాలను ట్విటర్లో ట్వీట్ చేస్తూనే ఉన్నారు..ఈ సమ్మిట్ లో అమెరికా బృందానికి ప్రాతినిద్యం వహించింది ఇవాంక..ఇక్కడ రెండు రోజుల పాటు సమావేశాల్లో పాల్గొంటూ మధ్యలో ఫలక్ నుమా ఫ్యాలెస్ లో ప్రధాని ఇచ్చినవిందులో పాల్గొంది..హైదరాబాద్ పర్యటన చివరిలో గోల్కోండని సందర్శించారు ఇవాంక..ఇవాంక బస చేసిన హోటల్ లో ఒక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది అదేంటో తెలుసా…?

ఇవాంక రాకకుముందు ఎన్నో ఊహాగానాలు వార్తల్లో వచ్చాయి.కానీ వాటన్నింటిని పటాపంచలు చేస్తు ఆమె అందరితో చాలా ఫ్రెండ్లీ గా ఉన్నారు..హూందాగా వ్యవహరించారు..ఆమె ప్రవర్తనతో అందరిని ఆకట్టుకున్నారు.గ్లోబెల్ సమ్మిట్ లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఇవాంక ట్రంప్ బస చేసిన ట్రేడెంట్  హోటల్ వాతావరణం ఎంతగానో నచ్చేసిందట. హోటల్ సిబ్బందిని ఎంతో ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకోవడమే కాదు వారితో ఎంతో జోవియల్ గా గడిపిందట ఇవాంక. హైదరాబాద్ విశేషాలు వారిని అడిగితేనే తెలుస్తాయని అన్ని విషయాలు అడిగి తెలుసుకుందట..

రాత్రివేళ కాఫీ తాగే అలవాటు ఉన్నఇవాంకకి , ఆర్డర్ తో కాఫీ తెచ్చిన రూమ్ బాయ్ చాలా బాధగా ఉండడం ఆమెకు కనిపించిందట. ఏంటని అడిగితే హిందీలో తన గోడు వెల్లబోసుకున్నాడట. కానీ ఇవాంక కి హిందీరాకపోవడంతో.. హోటల్ మేనేజర్ ని పిలిచి ఆ రూమ్ బాయ్ చెప్పిన బాధలను ఇంగ్లిష్ లో తెలుసుకుందట. అది విన్న తరువాత ఇవాంక ఎంతో విచారణకు గురైందట… ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం ఆ రూం బాయ్ తన ఇంట్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయని, వృద్ధులైన తల్లి తండ్రులు ఉన్నారని, వారు అనారోగ్యం తో బాధపడుతున్నారని తన ఆవేదననంతా వెల్లబోసుకున్నాడట. తన జీతం వాళ్ళ ట్రీట్మెంట్ కే సరిపోతుందని కూడా చెప్పాడట. డబ్బు సరిపోక ఒక్కోసారి అప్పుచేసి మరీ వైద్యం చేయిస్తానని చెప్పాడట.

తన కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకోవడమే కాకుండా బాగా చదువుకోవాలన్న తన తపనను కూడా ఇవాంక ముందు వ్యక్తపర్చాడట. అందుకే రూమ్ బాయ్ ఉద్యోగం లో చేరానని కూడా చెప్పాడట.. మొత్తానికి అతని ధీనావస్తను విని చెలించిపోయిన ఇవాంక తన పీఏను పిలిచి ఆర్థిక సహాయం చేసిందట.ఈ ఒక్క ఘటన చాలదూ ఇవాంక మంచితనం తెలియచేయడానికి..తనకున్న వేలకోట్ల ఆస్తిలో కొంచెం సాయం చేసింది అని మీకనిపించొచ్చు.కానీ అంతరాత్రివేళ తన బాదను అర్దం చేసుకుని వివరాలు కనుక్కుని సాయం చేయడం అనేది విషయమే..ఈ రోజుల్లో పక్కవాళ్ల సమస్య వినే తీరికే లేదు కొందరికి..అలాంటప్పుడు ఇవాంక గ్రేటే కదా…

Comments

comments

Share this post

scroll to top