ఫ్లైట్‌ అందుకోలేనని చెప్పి ఆమె క్యాబ్‌ డ్రైవర్‌ను ఇంటికి పోనివ్వమంది. కానీ అతను ఆమె లాప్టాప్ తో ఏం చేసాడో తెలుసా.?

యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఉదంతం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటి ఘటనలు ఆ నగరంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఢిల్లీలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగానే మారింది. అడపా దడపా జరుగుతున్న ఘటనలతో వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ మధ్యే ఓ మహిళకు ఢిల్లీలో చాలా చేదు అనుభవం ఎదురైంది. ఘటన జరిగి దాదాపుగా 4 నెలలు అవుతున్నా ఆమె ఇప్పటి వరకు దాన్ని ఎవరికీ చెప్పలేదు. తాజాగా తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఆమె తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్‌ చేసుకుంది. ఇంతకీ.. అసలు ఏం జరిగిందంటే…

జాంకీ డేవ్‌ అనే మహిళ ఢిల్లీలో గత అక్టోబర్‌ 17వ తేదీన ఎయిర్‌ పోర్టుకు వెళ్లేందుకు తాను ఉంటున్న కెప్టెన్‌ విజయంత్‌ థాపర్‌ మార్గ్‌ నుంచి ఓ ఊబర్‌ క్యాబ్‌ను బుక్‌ చేసుకుంది. రాత్రి 8.05 గంటలకు ఫ్లైట్‌ ఉంది. కానీ ట్రాఫిక్‌ వల్ల ఆమెకు బాగా లేట్‌ అయింది. అప్పటికే రాత్రి 7.20 అవుతోంది. 7.32 వరకు ఎయిర్‌పోర్టులో ఉండాలి. దీంతో ఇక ఫ్లైట్‌ ను అందుకునే చాన్స్‌ లేదని ఆమె భావించి క్యాబ్‌ను తిరిగి వెనక్కి తిప్పమంది. తనను ఇంటికి తీసుకెళ్లమని ఊబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌కు చెప్పింది.

అయితే సదరు క్యాబ్‌ డ్రైవర్‌ ఆమె మాట వినలేదు. దీంతో ఆమె పదే పదే ఎంతో మర్యాదగా చెప్పింది, తనను ఇంటికి తీసుకెళ్లమని. అయినా అతను వినలేదు. ఈ క్రమంలోనే పక్కనే వేరే రోడ్డులోకి కారును పోనిచ్చి అక్కడే ఉన్న వసంత్‌ ఎన్‌క్లేవ్‌ వద్ద ఓ ఫ్లైవర్‌ కింద యూ టర్న్‌ తీసి కారును ఆపేశాడు. వెంటనే అతను కారులోంచి దిగి జాంకీ డేవ్‌ లగేజీ ఒక్కొక్కటిగా బయటకు తీసి రోడ్డుపై పారేయసాగాడు. అంతలో అతని చేతిలోకి ఆమె ల్యాప్‌టాప్‌ వచ్చింది. దాన్ని కూడా అతను విసిరేయాలని చూశాడు. కానీ ఆమె అడ్డుకుని ల్యాప్‌టాప్‌ తీసుకుంది. దీంతో ఆమెకు ఆ కారు డ్రైవర్‌కు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఓ దశలో ఆమెపై ఆ కారు డ్రైవర్‌ భౌతికంగా దాడి కూడా చేయబోయాడు.

ఇంత తంతు జరుగుతున్నా చుట్టూ ఉన్న వారు బొమ్మల్లా చూస్తూ ఉండిపోయారు కానీ ఆమెపై జరుగుతున్న దాడిని ఒక్కరూ ఆపలేకపోయారు. ఒకరిద్దరు ఆమెకు సహాయం చేయాలని చూశారు కానీ వారిని ఆ డ్రైవర్‌ బెదిరించాడు. దీంతో మళ్లీ ఎవరూ ఆ సాహసం చేయలేకపోయారు. ఇక చివరిగా ఆ డ్రైవర్‌ ఆమె వద్ద డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ ఘటనపై ఊబర్‌కు జాంకీ ఫిర్యాదు చేసింది. వారు ఆమె ఈ-మెయిల్‌ అడిగారు. ఆమె తన ఈ-మెయిల్‌ ఐడీ కన్‌ఫాం చేసింది. అంతే.. ఇంక ఇప్పటి వరకు ఊబర్‌ నుంచి స్పందన రాలేదు.

ఈ ఘటన జరిగి నెలలు కావస్తున్నా.. ఇప్పటి వరకు దీనికి గురించి జాంకీ ఎవరికీ చెప్పలేదు. కానీ తాజాగా తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఈ ఘటన గురించిన వివరాలు బయట పెట్టింది. ఇప్పటి వరకు ఊబర్‌ తన సమస్య పట్ల స్పందించలేదని చెప్పింది. ఇక ఇప్పుడు చెప్పండి.. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని ఏం చేయాలో. ఏది ఏమైనా ఏ మహిళకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురు కాకూడదు కదా..!

Comments

comments

Share this post

scroll to top