అతను.. ఆమె…ఓ క్యాబ్. ( కథ).

శుక్రవారం సాయంత్రం ఏడు గంటలు.. భారీ వర్షానికి నగరం అంతా తడిసిముద్దయింది. రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది.  ఓ  దినపత్రిక సబ్ ఎడిటర్‌గా పనిచేసే కిరణ్ ఆఫీస్‌లో పంచ్ కొట్టి కిందికి వచ్చాడు. రెగ్యులర్ గా బస్ లో వెళ్లే కిరణ్…ఈ వర్షంలో అంత రిస్క్ వద్దని…ఉబెర్ క్యాబ్ ను బుక్ చేశాడు. ఒక్కడికే అయితే ఛార్జ్ ఎక్కువ అవుతుంది కాబట్టి..షేరింగ్ లో క్యాబ్ ను బుక్ చేసుకున్నాడు. వెంటనే కార్ డ్రైవర్ ఫోన్ చేసి….సార్ నేను సిటీ సెంటర్ దగ్గర ఉన్న….ఇక్కడ ఓ పిక్ అప్ ఉంది, తర్వాత మీ దగ్గరికే వస్తా….అని చెప్పాడు. ఓకే అని.. సెల్ ఫోన్ బ్రౌజ్ చేస్తూ ఆఫీస్ వద్ద కూర్చున్నాడు  కిరణ్.
ఇంతలోనే….క్యాబ్  కిరణ్ దగ్గరికి రావడంతో కార్ ఎక్కాడు. ఇద్దర్ని పిక్ అప్ చేసుకున్న కార్…మూడవ వ్యక్తి కోసం క్యాన్సర్ హాస్పిటల్ వైపుగా వెళ్ళింది. కార్ హాస్పిటల్ దగ్గరకు రాగానే ఓ అమ్మాయి వారితో  జాయిన్ అయ్యింది.  వెనుక సీట్ రైట్ విండో పక్కన కిరణ్…మధ్యలో 60 సంవత్సరాల విశ్వనాథ్… లెప్ట్ సైడ్ విండో పక్కన అమ్మాయి….కార్  ట్రాఫిక్ ను చేధించుకుంటూ  నెమ్మదిగా వెళుతుంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కు కిలో మీటర్ ముందే…విపరీతమైన ట్రాఫిక్ తో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి… కొంత మంది బైక్ వ్యక్తులు సిగ్నల్స్ ను సైతం పట్టించుకోకుండా రాంగ్ రూట్లలో వెళుతున్నారు. దీంతో ట్రాఫిక్ కు మరింత అంతరాయం ఏర్పడింది.
అప్పుడప్పుడు కిరణ్…ఆ అమ్మాయిని చూస్తున్నాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా..ఇప్పుడు కిరణ్ ది అదే పరిస్థతి…అమ్మాయి కిరణ్ కు తెగ నచ్చేసింది. ఇంతలోనే కార్ లో ఉన్న విశ్వనాథం తెగ ఆయాస పడుతున్నాడు.గాలి పీల్చుకునే స్థితి నుండి క్రమంగా అపస్మారక స్థితిలోకి జారుకుంటున్నాడు. ఇది గమనించిన ఆ అమ్మాయి…హాలో.. ఈయనకు హార్ట్  ఎటాక్ వచ్చినట్టుంది. వెంటనే ఇతని  కుడిచేతిని రబ్ చేయండి….ఫాస్ట్  అంటూ కిరణ్ కు చెబుతుంది.  హా…అంటూ కిరణ్ విశ్వనాథ్ చేతిని రబ్ చేస్తున్నాడు….ఆమె విశ్వనాథ్ ఛాతీ మీద రుద్దుతూ ఉంది. త్వరగా పోనివ్వండి….. ఇతని పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని డ్రైవర్ తో అంటుంది ఆ అమ్మాయి. మేడమ్ వెళ్లడానికి లేదు..అంతా ట్రాఫిక్ జామ్ అని డ్రైవర్ సమాధానం.
uber cab
ఇది గమనించిన కిరణ్..కార్ దిగి వర్షంలో తడుస్తూ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తాడు…. కార్ కు కాస్తంత గ్యాప్ దొరికే సరికి..దాంట్లోంచే బండిని మూవ్ చేస్తూ ట్రాఫిక్ నుండి కార్ బయటపడుతుంది. వెంటనే కార్ ఎక్కిన కిరణ్ దగ్గర్లో ఓ హాస్పిటల్ ఉందంటూ దాని షార్ట కట్ రూట్ చెబుతూ ఉంటాడు. కార్ హాస్పిటల్ దగ్గరకు రాగానే విశ్వనాథ్ ను కిరణ్ చేతుల మీద ఎత్తుకొని ..లోపలికి తీసుకెళ్లి…స్ట్రెచర్ మీద పడుకోబెడుతూ ఎమర్జెన్సీ అనడంతో…అక్కడి స్టాప్ …అతనిని ఎమర్జెన్సీ వార్డ్ లోకి తీసుకెళతారు.
మీరు  ట్రాఫిక్ క్లియర్ చేయకపోయింటే ఇంత త్వరగా  వచ్చేవాళ్లం కాదు….అని ఆ అమ్మాయి కిరణ్ తో అంటుండగానే కిరణ్ మధ్యలో కలుగజేసుకోని….ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని  మీరు అలర్ట్ చేయడంతోనే నేనే ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యా…అయినా మీకెలా తెలుసు..ఆయనకు హార్ట్ ఎటాక్ అని..?. అడుగుతాడు కిరణ్….హో అదా..నేను క్యాన్సర్ హాస్పిటల్ లో  నర్స్ ను , నా పేరు శృతి అని కిరణ్ తో చెబుతుంది. నా పేరు కిరణ్ అని చేయి కలుపుతాడు. సరే అండి నేను వెళతా నాకు కాస్త  అర్జెంట్ పని ఉంది. మీరు ఆ పెద్ద మనిషి వాళ్ల ప్యామిళీ వాళ్లకు ఇన్ఫాం చేయండి అంటూ వెళ్ళిపోతుంది శృతి.
                     ——————————————————
త్వరగా ఇంటికి వద్దామనుకున్న కిరణ్ కు ఆ రోజు చాలా ఆలస్యమైంది. ఇంటికొచ్చిన కిరణ్ కు శృతి గుర్తొస్తూ ఉంది.  ఆమె జ్ఞాపకాలతో రాత్రంత జాగారం చేశాడు. తెల్లారి ఆమె పేరుతో గూగుల్ మొత్తం వెతికాడు. ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేశాడు. చివరకి ఆమె ఫేస్‌బుక్ ఐడీ కనిపించింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. వారం అయింది. పదిరోజులయింది. ఇంకా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదు.
 అప్పటి నుంచి కిరణ్  తన ఆఫీస్ పూర్తవ్వగానే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర వెయిట్ చేయడం మొదలుపెట్టాడు. గేట్ దగ్గర కూర్చుని సిగరెట్ తాగుతూ అమ్మాయి కోసం నిరీక్షించేవాడు. కిరణ్ తన కోసం ప్రతి రోజూ రావడాన్ని, వెయిట్ చేయడాన్ని శృతి గమనిస్తూనే ఉంది.ఎప్పటిలాగానే హాస్పిటల్ దగ్గర శృతి కోసం ఎదురుచూస్తున్న కిరణ్ దగ్గరికి అక్కడి  షాపు అమ్మాయి వచ్చి…మీరు ప్రతి రోజూ నాకు లైన్ వేస్తున్నారని తెలుసు…అని ఐ లవ్ యు అని అతనికి ప్రపోజ్ చేస్తుంది.  అప్పుడు కిరణ్ ఆ అమ్మాయితో నేను మీ కోసం రావడం లేదు. నాకు అలాంటి ఫీలింగ్ లేదు. నేను క్యాన్సర్ హాస్పిటల్‌లో పనిచేసే శృతి గురించి వస్తున్నాను. వెయిట్ చేసే క్రమంలో మీ వై ఫైకి పాస్‌వర్డ్ లేకపోవడం ఇక్కడ కూర్చుని నెట్ వాడుకుంటున్నాను అన్నాడు.
షాక్ గురైన ఆ అమ్మాయి తనకు దక్కని కిరణ్ ఇంకెవరికీ దక్కకూడదని శృతి నాకు తెలుసు. నా బెస్ట్ ఫ్రెండ్. అయినా ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది. మీకు తెలియదా? అని అబద్దం చెప్పింది. చీకటి పడడంతో ఇంటికి బయల్దేరిన కిరణ్‌కు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గరికి వెళ్లగానే అతి వేగంగా వచ్చి ఓ కారు ఢీ కొట్టింది. తీవ్ర రక్త స్రావం అవుతుంటే అక్కడున్న వాళ్లందరూ ఫిలింనగర్‌లో ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రతి రోజూ తనకోసం వచ్చే కిరణ్ వారం రోజులుగా కనిపించకపోవడంతో శృతి కూడా టెంక్షన్ పడుతుంది.
దెబ్బల నుండి కోలుకున్న కిరణ్ హాస్పిటల్ నుండి  ఇంటికి వెళ్లడానికి ఉబర్ క్యాబ్ బుక్ చేశాడు.కార్లో  కిరణ్, వాళ్ల తమ్ముడు నరేష్, అమ్మ ముగ్గురు వెనక కూర్చున్నారు. అపోలో నుంచి బయటికి రాగానే కారులో ముందు ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని ఒక అమ్మాయి ఎక్కింది. కృష్ణానగర్ రాగానే కిరణ్ వాళ్లు దిగుతుంటే శృతి వాళ్లను గమనించింది. గాయాలతో ఉన్న కిరణ్‌కు గుర్తు పట్టింది. షాక్ గురై ఏం జరిగింది? అని అడిగింది. జరిగిన విషయం మొత్తం శృతికి వివరించాడు కిరణ్. శృతి ఏడుస్తూ కిరణ్‌ను ఆలింగనం చేసుకుంది. నన్ను ఇంతగా ప్రేమిస్తున్న నువ్వే నాకు కావాలి. నా జీవితాంతం నీకు తోడుంటా అని చెప్పింది. చివరకు కిరణ్ వాళ్ల తల్లిదండ్రులు శృతి తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేశారు. సంవత్సరం తర్వాత ఇద్దరూ సరదాగా కేబీఆర్ పార్కుకెళ్లినప్పుడు మళ్లీ ఆ షాప్  అమ్మాయి కలిసింది. ఇద్దరినీ చూసి ఆశ్చర్యపోయింది.
నిజమైన ప్రేమ నిలిచి గెలిచింది. మోసం చేయాలనుకున్న ఆ అమ్మాయి ఇంకా ఒంటరిగానే ఉన్నది. ప్రేమించిన కిరణ్, ప్రేమించబడిన శృతి సుఖసంతోషాలతో ఉన్నారు. మధ్యలో వచ్చి మోసం చేయాలనుకున్న ఆ అమ్మాయి మాత్రం నాది నాది అనుకున్నది ఏదీ నాది కాదు.. నీదైనది నీ చేయి జారిపోదు అనే విషయాన్ని తెలుసుకుని తన జీవితాన్ని తను జీవిస్తున్నది.
కథను పంపిన వారు; అజ‌హ‌ర్ షేక్‌ (9963422160)

మీరు మీ కథలను మాకు పంపాలనుకుంటే… మా Email: ap2tgtelugu@gmail.com

Comments

comments

Share this post

scroll to top