గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ “డ్రగ్స్ వివాదం”. కొంతమంది ప్రముఖల పేర్లను కొన్ని మీడియా చానెల్స్ బయటపెట్టాయి. అందులో నటుడు రవితేజ పేరు కూడా ఉండడం అభిమానులను షాక్ కి గురి చేసింది. మొన్నే తన తమ్ముడు భారత ఆక్సిడెంట్ లో మరణిస్తే అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా వివాదంలో ఇరుక్కున్నాడు రవితేజ.
సినీనటుడు రవి తేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదం డ్రగ్స్ ముఠా రట్టుకు కారణమైంది. ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ దుర్మరణం పాలవడం, కారు వేగంగా లారీని ఢీ కొట్టడంతో భరత్ ముఖం గుర్తు పట్టలేనంతగా ఛిద్రమైన విషయం తెలిసిందే. కారు ప్రమాదానికి గురైందన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించగా ఫోన్ లభ్యమైంది. ఈ ఫోన్లోని కొన్ని నంబర్లను పోలీసులు ఫోన్ చేసి ప్రమాద విషయం చెప్పగా కొంత మంది నిర్లక్షంగా సమాధానం ఇచ్చారు. చివరకు మృతుడు సినీ హీరో రవి తేజ సోదరుడని తేలింది. మృతుడు భరత్ గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడటం, పోలీసు కేసులు ఉండటంతో అతడి కాల్ డాటాను విశ్లేషించారు.
ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ ముఠాలకు సంబంధించిన సమాచారం చిక్కినట్లు తెలిసింది అని సమాచారం. డ్రగ్స్ ముఠాలతో భరత్‌కు సంబంధాలున్నాయన్న అంశం గత కొంత కాలంగా పోలీసులు గుర్తించారు. అయితే పోలీసుల కదలికలను గమనించిన భరత్ అత్యంత గుంభనంగా వ్యవహారాన్ని నడిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. భరత్ ఫోన్లోని డాటా, డ్రగ్స్ ముఠాలో కీలక నిందితుడు క్యాల్విన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లోని డాటాను కూడా అధికారులు పోల్చి చూస్తున్నారు. భరత్ ఫోన్లోని డాటాలో ఉన్న చాలా నంబర్లు క్యాల్విన్ ఫోన్లోనూ లభ్యమవడం, ఆ నంబర్లలోని వారు తరచూ క్యాల్విన్తో మాట్లాడినట్లు తేలడంతో వారందరినీ విచారించాలని అధికారులు నిర్ణయించారని పలు మీడియా వార్తల్లో కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా…మరొక వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రవితేజ వల్లనే భరత్ మట్టుకు బానిసయ్యాడు అని. రవితేజ వాట్స్ ఆప్ చాట్ అతని కొంపముంచింది అని కూడా వార్త వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది స్పష్టత లేదు. అధికారిక వార్త కోసం ఎదురు చూడాల్సిందే!