వేగంగా వెళ్తున్న ఆ “రైలు”…సడన్ గా 6 కిలోమీటర్లు వెనక్కి నడిచింది..! ఎందుకో తెలుసా..?

ట్రైన్ వెనక్కి రావడం ఏంటి…ఇదేమైనా బాలకృష్ణ సినిమానా అనుకుంటున్నారా? కానే కాదండి. దిండుగల్‌ సమీపంలో జరిగిన యదార్ధ ఘటన. బోగీ నుంచి జారిపడ్డ ప్రయాణికుడి కోసం పాండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆరు కిలోమీటర్లు వెనక్కి నడిచింది. గాయపడిన ఆ ప్రయాణికుడిని ఆ రైలులో ఎక్కించి పక్క స్టేషన్‌లో చేర్చి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివరాలలోకి వెళ్తే

దిండుగల్‌ వేల్వార్‌కోటలోని ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ప్రవీణ్‌ (18) అనే యువకుడు దిండుగల్‌కు పాండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రవీణ్‌ ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించాడు. దిండుగల్‌ సమీపం తామరైపట్టి వద్ద ఆ రైలు వెళుతుండగా అతడు పట్టాలకు దూరంగా జారిపడ్డాడు. వెంటనే ఆ బోగీలో ప్రయాణిస్తున్న కొందరు చైను లాగి రైలును ఆపివేశారు. అప్పటికే ఆ రైలు ఆరుకిలోమీటర్లు దూరాన్ని అధిగమించింది. చైను లాగి రైలు ఆగిపోవడంతో గార్డులు, ఇంజన్‌ డ్రైవర్‌ ఆ బోగి వద్దకువచ్చి విచారణ జరిపి ప్రవీణ్‌ పుట్‌బోర్డు నుంచి జారిపడిన సంగతి తెలుసుకున్నారు.

ఆ తర్వాత పక్కస్టేషన్‌ కంట్రోలు రూమ్‌ అధికారులకు సమాచారం అందించి ఆ యువకుడిని కాపాడేందుకు రైలింజన్‌ డ్రైవర్‌ ఆ రైలును ఆరు కిలో మీటర్ల దూరం వరకు వెనక్కి నడిపాడు. అప్పటికే నేలపై పడి తీవ్రగాయాలతో కొన ఊపిరితో ఉన్న ప్రవీణ్‌ను బోగీలో ఎక్కించారు. ఆ తర్వాత రైలు ముందుకు కదలింది. పక్కస్టేషన్‌కు ఆ రైలు చేరగానే, అప్ప టికే ఆ స్టేషన్‌లో సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌లో ప్రవీణ్‌ను ఆసుపత్రికి తరలించారు. రైలును వెనక్కి నడిపి ఓ ప్రయాణికుడిని కాపాడిన రైలింజన్‌ డ్రైవర్‌ను, అందుకు ఆదేశాలు ఇచ్చిన రైల్వే ఉన్నతాధికారులను రైలు ప్రయాణికులు మనసారా అభినందించారు.

 

Comments

comments

Share this post

scroll to top