2011 వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుందని చెప్పిన “జ్యోతిష్కుడు” ఇప్పుడు కోహ్లీ గురించి ఏమన్నారంటే.?

సౌతాఫ్రికా టూర్‌లో ఉన్న భార‌త క్రికెట్ జట్టు త‌న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఘోర ఓట‌మి పాలైన విషయం తెలిసిందే. బౌల‌ర్లు రాణించినా బ్యాట్స్‌మెన్ విఫ‌లం చెంద‌డంతో మొద‌టి టెస్ట్ మ్యాచ్‌ను భార‌త్ కోల్పోయింది. దీంతో 3 టెస్ట్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో అయితే కెప్టెన్ కోహ్లి స‌హా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా ఫెయిల‌య్యారు. దీంతో భార‌త్‌కు ఘోర ఓటమి త‌ప్ప‌లేదు. అయితే ఇలాంటి చిన్న చిన్న అప‌జ‌యాలు కోహ్లి కెరీర్‌కు ఏ మాత్రం అడ్డుకాబోవ‌ట‌. భ‌విష్య‌త్తులో మాత్రం కోహ్లి ఎన్నో విజ‌యాల‌ను టీమిండియాకు అందిస్తాడ‌ట‌. దీంతోపాటు అత‌ను క్రికెట్ ప‌రంగా, త‌న‌కు ఉన్న ఎండార్స్‌మెంట్స్ ప‌రంగా ఉన్న‌త స్థానాల‌కు చేరుకుంటాడట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. అలా అని మేం చెప్ప‌డం లేదు. ఆ క్రికెట్ జ్యోతిష్యుడు చెబుతున్నాడు.

ఆయ‌న పేరు న‌రేంద్ర బుండే. ఈయ‌నో ప్ర‌ముఖ క్రికెట్ జ్యోతిష్యుడు. గ‌తంలో ఈయ‌న మన భార‌త క్రికెట్‌, క్రికెట‌ర్ల‌కు సంబంధించి అనేక విష‌యాల్లో జోస్యం చెప్ప‌గా అవ‌న్నీ నిజ‌మ‌య్యాయి. మాజీ ఆట‌గాడు స‌చిన్ టెండుల్క‌ర్ త‌న టెన్నిస్ ఎల్బో స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డి మ‌ళ్లీ జ‌ట్టులోకి వ‌స్తాడ‌ని బుండే చెప్ప‌గా అది నిజ‌మే అయింది. అలాగే సౌర‌వ్ గంగూలీ జ‌ట్టుకు దూర‌మైనా మ‌ళ్లీ అత‌ను జ‌ట్టులోకి వ‌స్తాడ‌ని చెప్పాడు బుండే. అది కూడా అలాగే జ‌రిగింది. దీంతోపాటు 2011 లో టీమిండియా వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను గెలుస్తుంద‌ని చెప్ప‌గా, అది కూడా అలాగే జ‌రిగింది. ఇక భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కు మ్యాచ్‌ల‌లో 33 వ నంబ‌ర్ ఉన్న జెర్సీని ధరించ‌మ‌ని బుండే చెప్ప‌గా ఆమె అలాగే చేసింది. ఈ క్ర‌మంలోనే గ‌తేడాది జ‌రిగిన మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మిథాలీ రాణించింది. ఇలా బుండే ఎంతో మంది భార‌త క్రికెట‌ర్ల‌కు జోస్యం చెబుతుండేవాడు. ఆశ్చ‌ర్య‌క‌రంగా అవ‌న్నీ నిజం అవుతుండేవి.

అలా బుండే తాజాగా ఇప్పుడు విరాట్ కోహ్లికి కూడా జోస్యం చెబుతున్నాడు. కోహ్లి భ‌విష్య‌త్తులో మ‌రిన్ని సిరీస్‌లలో రాణిస్తాడ‌ని, ముఖ్యంగా ఇప్పుడు అత‌ని గ్ర‌హ స్థితి ప్ర‌కారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల‌లో మ్యాచ్‌లు జ‌రిగితే కోహ్లి సేన ప్ర‌త్య‌ర్థి జట్టును వైట్ వాష్ చేస్తుంద‌ని చెబుతున్నాడు. ఇక కోహ్లి త‌న కెరీర్ ప‌రంగానేకాక‌, త‌న‌కు ల‌భించే ఎండార్స్‌మెంట్ల విష‌యంలోనూ ఉన్న‌త స్థానాల‌కు చేరుకుంటాడ‌ని బుండే చెబుతున్నాడు. అత‌ని నేతృత్వంలో టీమిండియా విజ‌యాలు బాగా సాధిస్తుంద‌ని అంటున్నాడు. అదే నిజ‌మైతే.. భార‌త క్రికెట్‌ జ‌ట్టు ప్ర‌పంచంలోనే మేటి జ‌ట్టుగా అవ‌త‌రించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది క‌దా. చూద్దాం మ‌రి.. బుండే జోస్యం నిజ‌మ‌వుతుందో కాదో..!

Comments

comments

Share this post

scroll to top