ఆసిఫా బానో అత్యాచార ఘ‌ట‌నపై ఈ నీచుడు ఏమ‌ని కామెంట్ చేశాడంటే..

జ‌మ్మూ కాశ్మీర్ క‌తువాలో కొద్ది రోజుల కింద‌ట 8 ఏళ్ల బాలిక‌పై జ‌రిగిన అత్యాచార ఘ‌ట‌న విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీనిపై ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లంద‌రూ స్పందిస్తున్నారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని, వారిని ఉరి తీయాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తుంటే కొంద‌రు ప్ర‌బుద్ధులు మాత్రం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ ఘ‌ట‌న‌పై వికృత కామెంట్ల‌ను పోస్ట్ చేస్తున్నారు. అలా ఓ వ్య‌క్తి పెట్టిన కామెంట్ల‌కు ప్ర‌జ‌లు భ‌గ్గుమన్నారు. దీంతో ఆ ప్ర‌బుద్ధుడి ఉద్యోగం కాస్తా ఊడింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

జ‌మ్మూ కాశ్మీర్ క‌తువా ప్రాంతంలో 8 ఏళ్ల బాలిక‌ ఆసిఫా బానోపై అత్యాచారం చేసి ఆమెను హ‌త్య చేసిన నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. అయితే ఓ వైపు ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాల‌ని చాలా మంది పోరాడుతుంటే.. మ‌రో వైపు కేరళకు చెందిన ఓ వ్యక్తి బాధితురాలు చిన్నారి అసిఫాను అవమానిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు. కేరళకు చెందిన విష్ణు నందకుమార్‌ కొచ్చిలోని కొటక్‌ మహింద్రా బ్యాంక్‌ బ్రాంచ్‌ లో అసిస్టెంట్‌ మేనేజర్‌ గా పని చేస్తున్నాడు. ఇత‌ను ఆసిఫా బానో అత్యాచారం, హ‌త్య ఘ‌ట‌న‌పై అవ‌మాన‌కర రీతిలో వ్యాఖ్య‌లు చేశాడు.

విష్ణునందకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ఆసిఫా ఈ వయసులోనే హత్యకు గురవడం మంచిది అయింది.. లేకుంటే పెరిగి పెద్దయి భారత్‌ మీదకు బాంబులు విసిరేది అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ విష‌యంపై సోషల్‌ మీడియాలో పెద్ద‌ దుమారమే చెల‌రేగుతోంది. నిందితులను సమర్థించే ఇతడు కూడా.. మానవ మృగం అని, అసలు వీడు మనిషేనా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ఇలాంటి వ్యక్తిని ఉద్యోగంలో పెట్టుకున్న‌ ఆ బ్యాంక్ ఎలాంటిదో అర్థం అవుతుందని, మాకు గానీ ఆ బ్యాంక్ లో అకౌంట్స్ ఉంటే వెంట‌నే వాటిని క్లోజ్ చేస్తాం.. అంటూ చాలా మంది కొటక్ మహీంద్ర బ్యాంక్ పైన‌ విమర్శలు చేశారు. దీంతో చాలా మంది నుంచి నిర‌స‌న రావ‌డంతో ఈ విషయంపై కొటక్ మహీంద్రా బ్యాంక్ స్పందించింది. ఏప్రిల్‌ 11, 2018న విష్ణు నందకుమార్‌ ను ఉద్యోగం నుంచి తీసేసినట్లు ప్రకటించింది బ్యాంక్. యావత్‌ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఆసిఫా ఘటనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కొటక్ మహింద్రా తన ఫేస్‌బుక్‌ అకౌంట్ లో పోస్టు చేసింది. అవును మ‌రి.. ఈ దారుణ‌మైన ఘ‌ట‌న‌ను ఎవ‌రైనా ప్రాంతాల‌కు, వ‌ర్గాల‌కు అతీతంగా ఖండించాల్సిందే. నిందితుల‌కు క‌ఠిన శిక్ష వేయాల‌ని డిమాండ్ చేయాల్సిందే. అది చేయాల్సింది పోయి.. చిన్నారి అత్యాచార ఘ‌ట‌న‌పై వికృత కామెంట్లు పెట్ట‌డం ఏంటి ? ఇలాంటి కామెంట్లు పెట్టేవారిని కూడా క‌ఠినంగా శిక్షించాల్సిందే క‌దా..!

 

Comments

comments

Share this post

scroll to top