“బాహుబలి” లో “కన్నా నిదురించారా” పాటలో “అనుష్క” పక్కన నటించిన ఈమె ఎవరో తెలుసా..?

బాహుబలి సినిమా గురించి కొత్త ఇంట్రడక్షన్ ఇస్తే బాగుండదు అనుకుంట! ప్రపంచానికి తెలుగు సినిమా అంటే ఏంటో పరిచయం చేసిన సినిమా బాహుబలి. రాజమౌళి గారు ప్రతి తెలుగు వాడు గర్వపడేలా తీసిన సినిమా అది. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్కలకు ఈ సినిమా ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది! ఈ సినిమాలో ఛాన్స్ కోసం ఎంతో మంది ట్రై చేసారు. కానీ చాల మందికి దక్కలేదు. కానీ ఒకరికి మాత్రం అడగకుండానే ఈ సినిమాలో నటించే అవకాశం దొరికేసింది. ఇంతకీ ఎవరా ఆర్టిస్ట్ అనుకుంటున్నారా?

“కన్నా నిదురించారా” పాత గుర్తుంది కదా? ఈ పాటలో అనుష్క పక్కనే ఇంకొకామె కూడా డాన్స్ చేస్తుంది. ఆమె గురించి ఇప్పుడు మన ఆర్టికల్! అనుష్క శెట్టి వదినగా ఈ చిత్రంలో నటించింది. అనుష్క కంటే వయసులో చిన్నదైన 27 ఏళ్ల “ఆశ్రిత”.


భరతనాట్యం, కూచిపూడి నాట్యంలో తనకంటూ ప్రతిభ సాధించింది “ఆశ్రిత”. అయితే ఆమెకు సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా?  ఓసారి ఆమె ఓ ప్రదర్శన ఇస్తున్నారు. ఆ ప్రదర్శన వీక్షించే ఆడియన్స్ లో రాజమౌళి కుటుంభం కూడా ఉంది. ఆ పెర్ఫార్మెన్స్ అయిపోయిన నెలకు రాజమౌళి కొడుకు కార్తికేయ నుండి ఫోన్ కాల్ వచ్చింది. మీకు సినిమాలో నటించే ఉద్దేశ్యం ఉందా అని. అలా అడిగితె అవకాశం ఎవరు వదులుకుంటారు చెప్పండి! అందులోను బాహుబలి సినిమా.అందుకే ఆశ్రిత ఓకే చెప్పేసింది.

అలా తన నాట్యమే తనకు అవకాశాన్ని సంపాదించిపెట్టింది అని ఆశ్రిత చెప్పుకొచ్చింది. ఈ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. ఆశ్రిత ప్రస్తుతం మరికొన్ని సినిమాలకు ఓకే చెప్పింది. అంతేకాకుండా వివిధ దేశాల్లో ప్రదర్శనలు కూడా ఇవ్వబోతోంది.

Comments

comments

Share this post

scroll to top