ఈ థియేటర్ మాఫియా చేసే వాళ్ళను కాల్చి పడెయ్యాలి, టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ పైన విరుచుకుపడ్డ పేట సినిమా తెలుగు డిస్ట్రిబ్యూటర్.!!

పేట చిత్రం డిస్ట్రిబ్యూటర్ అశోక్ వల్లభనేని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ పైన విరుచుకుపడ్డాడు, వాళ్ళ పైన చాలా ఘోరంగా విమర్శలు గుప్పించాడు. టాలీవుడ్ లో ఇది వరకెప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ ఇంత ఘాటుగా విమర్శలు చెయ్యలేదు, సంక్రాంతి కి వస్తున్న నాలుగు చిత్రాల్లో మూడు తెలుగు సినిమాలు కొన్ని నెలల క్రితమే డేట్స్ అనౌన్స్ చేసారు, పెట్టా (తమిళ్) ని తెలుగు లో పేట గా సంక్రాంతి కి విడుదల చేస్తున్నాం అని ఇటీవలే చెప్పారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన పేట సినిమా జనవరి 10 న తెలుగు, తమిళ్ బాషలలో విడుదల కానుంది.

వీళ్ళందరూ ఏమన్నా థియేటర్లతో పుట్టారా.?

“నేను రజినీకాంత్ గారి స్ఫూర్తి తోనే రజినీకాంత్ సినిమా చేసే స్థాయికి వచ్చాను, నేను రజినీకాంత్ గారినే స్ఫూర్తి గా తీసుకున్నా.. సినిమా థియేటర్ ల విషయానికి వస్తే ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. చెప్పాలంటే ఒక యూవీ క్రియేషన్స్ వాళ్ళు కానివ్వండి, అల్లు అరవింద కానివ్వండి, దిల్ రాజు కానివ్వండి, ఇంకా కొంత మంది ఉన్నారు, వీళ్ళందరూ థియేటర్లతో పుట్టారా, సినిమాలు బాగుంటే జనాలు ఆదరిస్తారు, ఒకే సారి ఒకే సినిమాను 100 ల థియేటర్ లలో వేసి, మంచి సినిమాలు వచ్చాక థియేటర్ లు లేకుండా చెయ్యడం, ఎంత వరకు భావ్యం”. అని అశోక్ వల్లభనేని తెలిపారు

ఈ మాఫియా కు బుద్ధి చెప్పాలి :

“ఇవ్వాళ కేసీఆర్ గారు ఉన్నారు ఎంతో డైనమిక్ లీడర్, ఆయన ప్రజల అభిమానం తో మళ్ళీ రెండో సారి సీఎం అయ్యారు, ఒక మూడు గంటల సినిమాని ఒక 50 రూపాయిలు టికెట్ కొని చూస్తాడు ప్రేక్షకుడు, అతనికి నచ్చిన సినిమా చూడలేరు, వీళ్ళు వేసిన సినిమాలనే చూడాలా, వీళ్లు జనాల మీద రుద్దే సినిమాలు చూడాలా. దీనికి ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయాయ మార్గం చూపించాలి, పరిష్కరం చూపించాలనుకుంటున్నా. ఇక్కడ కేసీఆర్ గారు అయితేనేమి, అక్కడ చంద్రబాబు గారు అయితేనేమి, ఇటువంటి కుక్కలకు బుద్ధి చెప్పి, థియేటర్ మాఫియా ని కడిగేయాలి”. అని అశోక్ వల్లభనేని తెలిపారు

నయీమ్ ని చంపినట్టు చంపేయండి :

ఎవరినో నయీమ్ ని చంపారు, ఎంతో మందికి ఎంతో మేలు చేసే కేసీఆర్ గారు, ఇలా థియేటర్ మాఫియా చేసే వాళ్ళను ఎందుకు షూట్ చెయ్యరు, మాములు జనాలు వాళ్ళకి నచ్చిన సినిమాలు చూసే అవకాశం లేకుండా, ఇలా 100 లాది థియేటర్ లలో ఒకే సినిమాను వేసి చిన్న సినిమాను చంపేసి, నా సినిమాకి థియేటర్ లు మిగిలిన సినిమాలకు నా సినిమాకు కంపేర్ చేస్తే ఎంత నీచంగా ఉందో పరిస్థితి, ఇంకా చెప్పుకోవాలంటే సిగ్గు చేటుగా ఉంది నా పరిస్థితి, అయినా మంచి సినిమాలను జనాలు ఆదరిస్తారు, రెండో వారం నుండి జనాలు కుమ్ముతారు, పేట పేట ని పేట సినిమా ని జనాలు ముంచుతారు, జనాలే ఆదరిస్తారు అని నేను భావిస్తున్నా”, అని అన్నారు పేట చిత్రం తెలుగు డిస్ట్రిబ్యూటర్ అశోక్ వల్లభనేని.

ఈ సినిమా రైట్స్ ని తెలుగు లో అశోక్ వల్లభనేని భారీ మొత్తం లో సొంతం చేసుకున్నారు. 21 కోట్ల రూపాయలకు ఈ సినిమాను సొంతం చేసుకున్నారు అశోక్ వల్లభనేని. పేట సినిమా లో సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దికీ, త్రిష, బాబీ సింహ, మేఘ ఆకాష్ నటీ నటులు గా నటించారు. అయితే ఈ సినిమాకు ఆకర్షణ మాత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ ఎ,

 

Comments

comments

Share this post

scroll to top