ఆషాడ మాసంలో….కొత్తగా పెళ్లైన జంటను దూరంగా ఉంచడానికి గల 4 కారణాలు.!

ఆషాడమాసం…వస్తే చాలు కొత్తగా పెళ్ళైన ఆడవాళ్లు…తమ తమ తల్లుల ఇంటికి వెళతారు. ఈ మాసంలో నూతన వధువరులు కలవొద్దని, అత్త ,కోడలి ముఖం చూడకూడదని, కొత్త అల్లుడు అత్త ముఖం చూడకూడదని…ఇలా అనేక రకాల నిబంధనలు పెడతారు. అయితే దీని వెనుక చాలా లాజిక్ ఉంది. నిజంగా మన ఆచారాలను..సైంటిఫిక్ కోణంలో చూసినప్పుడు ప్రపంచమంతా… ఇండియా ఈస్ గ్రేట్ అనక తప్పదు…… మూఢనమ్మకం అని గుడ్డిగా నమ్మే బదులు…దానికి శాస్త్రీయతను యాడ్ చేసి చెప్పితే అద్భుత ఫలితాలుంటాయి.

Marryinaweek

ఆషాడ మాసంలో….కొత్తగా పెళ్లైన జంటను దూరంగా ఉంచడానికి 4 ప్రధాన కారణాలు:

#1. మనది ఎక్కువగా వ్యవసాయ ఆధారిత దేశం… ఆషాడ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి…ఈ సమయంలో ఎక్కువగా వ్యవసాయానికి సంబంధించిన పనులు ఉంటాయి… దున్నడం, విత్తనాలు చల్లడం, నారు పీకడం, నాటు వేయడం….ఇలా ఈ సీజన్ అంతా వ్యవసాయ పనులతో ఫుల్ బిజీబిజీ గా ఉంటుంది. ఈ సమయంలో కొత్తగా పెళ్లైన వధూవరులు ఒకచోట ఉంటే, పురుషుడు వ్యవసాయ పనులకు వెళ్లడానికి అంతగా ఆసక్తి చూపడు……దాని ఫలితం పంటపై పడుతుంది. దీనికి తోడు..వ్యవసాయ పనుల్లో అత్త పాల్పంచుకోవడం, కోడలి కారణంగా కొడుకు అంతగా ఇంట్రస్ట్ చూపకపోవడంతో…అక్కడ కోడలిపై అత్త ఒక రకమైన కోపాన్ని పెంచుకుంటుంది..ఇదే తర్వాతతర్వాత వారి మద్య సంబంధాలను దెబ్బతీస్తుంది.

#2. ఇది వర్షాల సీజన్ ..అంటే వ్యాధులు త్వరగా ప్రబలే సీజన్..ఈ టైమ్ లో నూతన వధూవరులు ఒకదగ్గర ఉంటే…. భార్యకు ప్రగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ,  ఈ సీజన్ లో మంచిగా ఉన్న వ్యక్తే అనేక వ్యాధులకు సులభంగా  గురవుతుంటాడు…అలాంటిది కడుపులో అప్పుడే  ఏర్పడుతున్న శిశువుపై ఈ వ్యాధుల ప్రభావం మరింతగా  ఉంటుంది కాబట్టి ..నూతన వధువరులను దూరం పెడతారు.

#3. ఇక ఈ సమయంలో ప్రెగ్నెన్సీ వస్తే…..డెలివరీ టైమ్ మంచి ఎండాకాలంలో ఉంటుంది…ఆ టైమ్ లోని విపరీతమైన ఎండలకు అప్పుడు పుట్టే పిల్లలు తట్టుకోలేరని ముందు జాగ్రత్తగా కొత్త జంట మధ్య కావాలనే ఈ మాసంలో దూరాన్ని పెంచుతారు.

#4. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు…అదే కోణంలో చూసినప్పుడు…..కొత్తగా పెళ్లైన జంట మద్య కాస్త గ్యాప్ ఇవ్వాలి…లేకపోతే…ఒకరిపై ఒకరికి ఏహ్యభావం కలుగుతుంది. రతిక్రీడ మీద ఆసక్తి తగ్గిపోతుంది.దీంతో సంసార జీవితం నిస్సారంగా మారిపోతుంది.  అలా కాకూడదనే….ఈ మాసం నూతన వధూవరులను దూరంగా ఉంచుతారు. 

featured image: source

 

Comments

comments

Share this post

scroll to top