ఆషాడ మాసంలో….గోరింటాకు ఎందుకుపెట్టుకుంటారో తెలుసా?

గోరింటాకు పేరు వినగానే ఆడవాళ్ల మనసు ఉప్పొంగిపోతుంది..అవును మరీ అందాన్ని ఇష్టపడే అతివల అరచేతులను మరింత అందంగా మార్చే గోరింటాకంటే ఎందుకు ఇష్టం ఉండదు…ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల మెహెందీలు ,ఎన్నో రకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి..అంతే కాకుండా గొరింటాకంటే ఆకు తెంపాలి,నూరాలి ఎంత మెత్తగా నూరినా డిజైన్సు పెట్టుకోవడానికి కొంచెం కష్టం ,దాంతో పాటు సమయం కూడా ఎక్కువ పడ్తుందని ఫీల్ అయ్యేవారు కూడా ఆషాడం వచ్చిందంటే మార్కెట్లో దోరికే రకరకాల మెహెందీలను పక్కన పెట్టి గోరింటాకు వైపే మక్కువ చూపిస్తారు…

ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యపరంగానూ..   ఆధ్యాత్మికంగాను ఎన్నో ఉపయోగాలున్నాయి.. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని వుంటుంది. ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది.అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి.. బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాకుండా.. డాక్టర్లు కూడా మంచిదని చెబుతున్నారు.

ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని.. ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు. ఇటు ఆరోగ్యపరంగానూ, అటు ఆధ్యాత్మకంగానూ ఎన్నో ప్రయోజనాలున్న గోరింటాకును తప్పనిసరిగా పెట్టుకోవాలి. దీని వల్ల మంచి హెల్త్ తో పాటుగా చేతులు ఎర్రగా పండి అందం, ఆకర్షణ ఇనుమడిస్తుంది.

మరింకేం సిటీలలో గోరింటాకు దొరక్కపోతే ఊరి నుండి తెప్పించుకుని రుబ్బించుకుని అమ్మచేత చందమామ పెట్టించుకునే ఆనందాన్ని మిస్ అవ్వకండి…

 

Comments

comments

Share this post

scroll to top