ప‌తంజ‌లికి చెందిన 25 ప్రోడ‌క్ట్స్ యాడ్‌లు త‌ప్పుదోవ ప‌ట్టించేవేనేట‌..!

మా టూత్ పేస్ట్ వాడితే మీ దంతాలు త‌ళ‌త‌ళా మెరుస్తాయి. మా హెయిర్ ఆయిల్ వాడితే మీ శిరోజాలు న‌ల్ల‌గా, ఒత్తుగా మారుతాయి. మా షాంపూతో మీ వెంట్రుక‌లు దృఢంగా పెరుగుతాయి. మా సోప్‌తో మీ ఒళ్లు త‌ళ‌త‌ళా మెరుస్తుంది… ఇలా సాగుతాయి నిత్యం మ‌నం చూసే ప్ర‌క‌ట‌న‌లు. టీవీలు, న్యూస్ పేప‌ర్లు, హోర్డింగ్స్‌… ఇలా ఏ మాధ్య‌మం తీసుకున్నా వాటిలో వ‌స్తున్న యాడ్స్ కోకొల్ల‌లు. అయితే మ‌రి నిజంగానే ఆయా ఉత్ప‌త్తులు క్వాలిటీగా ఉంటాయా..? అంటే అందుకు ఉండ‌వు… అనే స‌మాధానం వ‌స్తుంది. ఈ క్ర‌మంలోనే అలా వినియోగ‌దారుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే యాడ్స్‌పై ఇప్పుడు యాస్కి (ASCI – Advertising Standards Council of India) కొర‌డా ఝులిపిస్తోంది. ఇంత‌కీ… ఇప్పుడీ శాఖ అధికారులు చ‌ర్య‌లు తీసుకోబోతుంది ఏ సంస్థ‌పైనో తెలుసా..? పతంజ‌లి గ్రూప్‌పై..!

patanjali

ఏంటీ యాస్కి..?
త‌ప్పుదోవ ప‌ట్టించే యాడ్స్‌పై వినియోగ‌దారులు ఫిర్యాదు చేసేందుకు గాను భార‌త ప్ర‌భుత్వం యాస్కిని ఏర్పాటు చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ క‌న్‌జ్యూమ‌ర్ ఎఫెయిర్స్ (డీఓసీఏ), గ్రీవెన్సెస్ ఎగెయినెస్ట్ మిస్‌లీడింగ్ అడ్వ‌ర్ట‌యిజ్‌మెంట్స్ (గామా) శాఖ‌లు యాస్కితో క‌ల‌సి ప‌నిచేస్తాయి. యాడ్స్‌లో ఆయా కంపెనీలు చూపిన విధంగా త‌మ త‌మ ఉత్ప‌త్తులు ప‌నిచేయ‌క‌పోయినా, నాణ్యంగా లేకున్నా, ఇత‌ర ఏ కార‌ణాల వ‌ల్ల‌యినా ఆ యాడ్స్ త‌ప్పుదోవ ప‌ట్టించేవిగా ఉంటే వినియోగ‌దారులు గామా సైట్ http://gama.gov.in/Default.aspx లో ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. వాటిని డీవోసీఏ, యాస్కి, గామాలు క‌ల‌సి ప‌రిష్క‌రిస్తాయి. వినియోగ‌దారుడి ఫిర్యాదు నిజ‌మే అయితే సంబంధిత సంస్థ‌పై అవి చ‌ర్య‌లు తీసుకుంటాయి. స‌ద‌రు యాడ్స్‌ను మార్చ‌డ‌మో లేదంటే నాణ్యంగా లేని ఉత్ప‌త్తిని తొల‌గించమ‌ని కంపెనీకి చెప్ప‌డ‌మో చేస్తాయి. ఒక్కోసారి వినియోగదారుడికి న‌ష్టం ఎక్కువ‌గా క‌లిగితే సద‌రు సంస్థ నుంచి న‌ష్ట ప‌రిహారం కూడా ఇప్పిస్తాయి.

525 యాడ్స్ త‌ప్పుదోవ ప‌ట్టించిన‌వే..!
2013 నుంచి 2016 మ‌ధ్య కాలంలో గామా సైట్‌కు వ‌చ్చిన మొత్తం ఫిర్యాదుల్లో 525 యాడ్స్ వినియోగ‌దారుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేవిగా ఉన్నాయ‌ని వెల్ల‌డైంది. వాట‌న్నింటిపై చ‌ర్య‌లు తీసుకునే ప‌నిలో ప‌డ్డారు అధికారులు. ఈ క్ర‌మంలో చాలా ఫిర్యాదుల‌ను వారు ప‌రిష్క‌రించారు కూడా. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 363 ఫిర్యాదులపై అధికారులు త‌గిన చ‌ర్య‌ల కూడా తీసుకున్నారు.

companies-list-fake-ads

ప‌తంజ‌లి మ్యాట‌రేంటి..?
వినియోగ‌దారుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా యాడ్స్ ఇవ్వ‌డంలో ప‌తంజ‌లి సంస్థ కూడా ఇత‌ర సంస్థ‌ల‌కు అతీత‌మేమీ కాదు. ఆ కంపెనీ కూడా అలాంటి 33 యాడ్స్‌ను ప్ర‌దర్శించింది. వాటిలో 25కు పైగా యాడ్స్ త‌ప్పుడువేన‌ని యాస్కి తేల్చి చెప్పింది. అందులో ప‌తంజ‌లి సంస్థ‌కు చెందిన దంత్ కాంతి యాడ్ ప్ర‌థ‌మంగా నిలివ‌డం గ‌మ‌నార్హం. కావాలంటే దాని ఫిర్యాదు ప్ర‌తిని మీరు కింది చిత్రంలో చూడ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో అలా యాడ్స్ ఇచ్చినందుకు గాను ప‌తంజ‌లి భారీ మూల్య‌మే చెల్లించుకోనుంది. ఇప్ప‌టికే ఆ సంస్థ ప్ర‌ద‌ర్శిస్తున్న మిస్ లీడింగ్ యాడ్స్‌ను నిలిపివేయాల‌ని సంబంధిత అధికారులు ఆదేశించారు. యాడ్స్‌లో చెప్పిన విధంగా ఉత్ప‌త్తులు ఉండ‌డం లేద‌ని, నాణ్య‌త లోపంతో ఉంటున్నాయ‌ని, ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేకుండానే ఆ ఉత్ప‌త్తులు నాణ్యంగా ఉంటాయ‌ని యాడ్స్‌లో చెబుతున్నార‌ని అధికారులు గుర్తించారు. దీంతో ప‌తంజ‌లి అస‌లు బండారం బయ‌ట ప‌డింది. ఇక ఆ సంస్థపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో వేచి చూడాలి.

patanjali-complaint

మ‌రి మిగ‌తా కంపెనీలు..?
వినియోగ‌దారులను త‌ప్పుదోవ ప‌ట్టించే యాడ్స్‌ను ప్ర‌ద‌ర్శించ‌డంలో కేవ‌లం ఒక్క ప‌తంజ‌లి సంస్థే కాదు, ఇంకా అనేక ఇత‌ర కంపెనీలు కూడా ఆ లిస్ట్‌లో ఉన్నాయి. వోడాఫోన్‌, ఐడియా, ఎయిర్‌టెల్‌, హీరో మోటోకార్ప్‌, టాటా మోటార్స్‌, ఊబ‌ర్‌, లోరియ‌ల్‌, ప్రోక్ట‌ర్ అండ్ గ్యాంబిల్‌, హిందుస్తాన్ యూనిలివ‌ర్‌, అమైటీ, ఇండియా టుడే, ఫ్లిప్‌కార్ట్ వంటి అనేక కంపెనీలు మిస్ లీడింగ్ యాడ్స్ వేస్తున్నాయ‌ని తెలిసింది. వాటికి సంబంధించి వినియోగ‌దారులు ఇచ్చిన ఫిర్యాదుల‌ను కూడా యాస్కి ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోనుంది.

Comments

comments

Share this post

scroll to top