ఆస్కార్‌ రేసులో బాహుబలి !

రాజమౌళి  బాహుబలి చిత్రం  ఆస్కార్ రేసులో ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఆస్కార్‌ సెలక్షన్‌ ప్యానెల్‌లో సభ్యుడైన అమోల్‌ పాలేకర్‌  హైదరాబాద్‌లో 45 సినిమాలను అకాడమీ  అవార్డ్స్ కోసం ఎంపిక చేశారు. చారిత్రాత్మక కథతో, గ్రాఫికల్ హంగులను అద్ది , ఒక్కొక్క పాత్రను అద్భుతంగా చిత్రీకరించి, కలెక్షన్ల పరంగా టాలీవుడ్ లో టాప్ గా, హలీవుడ్ లో టాప్ 5 సినిమాలలో ఒకటిగా నిలిచిన రాజమౌళి బాహుబలి సినిమాను  అఫీషియల్ ఎంట్రీ‌గా పంపనున్నామని  తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ వెల్లడించింది.

అయితే రాజమౌళి బాహుబలికి  అమీర్‌ఖాన్‌ నటించిన పికె,   షాహిద్ కపూర్ నటించిన హైదర్, ప్రియాంక చోప్రా నటించిన మేరీ కొమ్‌ గట్టిపోటీని ఇస్తున్నాయ్. అంటే ఇది ఆస్కార్ కు ప్రిలిమ్స్ అన్నమాట. ఇందులో సెలెక్ట్ అయిన చిత్రం ఇండియా నుండి ఆస్కార్ నామినేషన్ కు  వెలుతుంది. అక్కడ రెండచెల పద్దతిలో  వడపోత ఉంటుంది. ఫైనల్ గా ఆస్కార్ గెలుచుకున్న సినిమా పేరును ప్రకటిస్తారు. గతంలో  తెలుగులో కె విశ్వనాథ్‌ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం సినిమా ఆస్కార్‌ ప్రైమరీ  లిస్టులో చేరింది.

అవార్డ్ దక్కుతుందా లేదా అనేది పక్కన పెడితే … ఆస్కార్ ప్రైమరీ  నామినేషన్ లో బాహుబలి సినిమా పేరుంటే చాలు మన టాలీవుడ్ సినిమా అంతర్జాతీయ రేంజ్ కు చేరినట్టే..సెప్టెంబర్ 25 వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది బాహుబలి ఆస్కార్ నామినేషన్ లిస్ట్ లో ఉందా లేదా అన్నది.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top