జ‌నాల్ని వెర్రి బ‌క‌రాల‌ను చేసిన జియో అంబానీ… 4జీ ఫోన్ అస‌లు నిజాలు తెలిస్తే ఆగ్ర‌హిస్తారు..!

ముఖేష్ అంబానీ ప్ర‌క‌టించిన రిల‌య‌న్స్ జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ గురించి అంద‌రికీ తెలిసిందే. రూ.1500 క‌డితే చాలు, ఫోన్ ను 3 ఏళ్ల పాటు వాడుకోవ‌చ్చని, త‌రువాత రూ.1500 తిరిగిస్తార‌ని చెప్పారు. దీంతో జియో 4జీ ఫోన్‌ను చాలా మంది బుక్ చేసుకున్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఎగ‌బ‌డి మ‌రీ ఆ ఫోన్‌కు బుకింగ్స్ వ‌చ్చాయ‌ని చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం 3 రోజుల వ్య‌వ‌ధిలోనే 60 ల‌క్ష‌ల మంది జియో 4జీ ఫోన్ల‌ను బుక్ చేసుకున్నార‌ని సాక్షాత్తూ జియో ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఈ ఫోన్ డెలివ‌రీలు కూడా షురూ అయ్యాయి. అయితే అంతా బాగానే ఉంది కానీ… తాజాగా వ‌చ్చిన ఓ వార్త జియో 4జీ ఫోన్‌ను బుక్ చేసుకున్న వారిలో తీవ్ర అసంతృప్తిని ర‌గిలిస్తోంది. అదేమిటంటే…

జియో 4జీ ఫోన్‌ను బుక్ చేసేట‌ప్పుడు కంపెనీ సైట్‌లో లేదా యాప్‌లో ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్ మాటే లేదు. కానీ ఇప్పుడు వాటిని జియో తన సైట్‌లో పెట్టింది. మ‌రి వాటిలో ఏముందో తెలుసా..? జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ను తీసుకున్నాక 3 ఏళ్ల పాటు ఉచితంగా దాన్ని వాడుకోవ‌చ్చ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది భావించారు. కానీ జియో పెట్టిన ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్ ప్ర‌కారం అలా కాదు. ఏడాదికి రూ.1500 క‌చ్చితంగా రీచార్జి చేయాలి. అలా చేస్తేనే ఫోన్ ప‌నిచేస్తుంది. దీంతో నెల‌కు క‌నీస రీచార్జి రూ.150 మొద‌లు కొని 3 ఏళ్ల పాటు ఏడాదికి రూ.1500 చొప్పున మొత్తం జియోకు యూజ‌ర్లు చెల్లించేది — 1500 X 3 = 4500, 150 X 36 నెల‌లు = 5400 రెండూ క‌లిపితే 4500 + 5400 = 9900 అవుతుంది. అంటే మూడు సంవ‌త్స‌రాల పాటు మీరు గ‌న‌క జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ను వాడితే మీరు జియోకు రూ.9900 చెల్లించాలి. ఆ త‌రువాత అందులో రూ.1500 తిరిగిచ్చేస్తారు. అంటే 9900 – 1500 = 8400 అవుతుంది. అంటే మొత్తంగా చూస్తే 3 ఏళ్ల‌కు మీరు జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌కు రూ.8400 చెల్లిస్తార‌న్న‌మాట‌. చూశారుగా… జ‌నాల్ని ఎలా వెర్రి బ‌క‌రాల‌ను చేశాడో అంబానీ..!

అయితే దీంతోనే అయిపోలేదు. ఒక వేళ మీరు జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ను 3 ఏళ్ల పాటు వాడ‌కుండా ముందుగానే.. అంటే.. ఏడాదికో, రెండేళ్ల‌కో తిరిగిచ్చేస్తాం అంటే కుద‌రదు. అప్ప‌టి వ‌ర‌కు మీరు చెల్లించిన డ‌బ్బుల‌కు తోడు మరి కొంత మొత్తాన్ని ఫైన్ రూపంలో చెల్లిస్తేనే వారు ఫోన్‌ను తీసుకుంటారు. ఏడాది లోప‌లే జియో ఫోన్‌ను వెన‌క్కిచ్చేస్తే అప్పుడు మీరు రూ.1500 చెల్లించాలి. అదే ఏడాది నుంచి రెండేళ్ల లోపు ఫోన్ ను ఇస్తే రూ.1000, రెండేళ్ల నుంచి 3 ఏళ్ల లోపు ఫోన్‌ను వెనక్కి ఇస్తే రూ.500 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ అస‌లు విష‌యం. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి.. అనే నిబంధ‌న‌లను నిజంగా చ‌క్క‌గా వాడుకుంది అంటే.. జియోనే అని చెప్ప‌వ‌చ్చు. ఇక‌నైనా ఇలాంటి ఫ్రీ ఆఫ‌ర్ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండండి..!

Comments

comments

Share this post

scroll to top