బిల్ తీసుకున్నాడు…పేస్ బుక్ లో పోస్ట్ చేసి అసలు మోసం బయటపెట్టాడు ఈ హైదరాబాదీ..! అసలేమైంది?

హైదరాబాద్.. గల్లీ గల్లీ నుంచి ఎక్కడ చూసినా వాహనాలు. అన్ని వెహికల్స్ కలుపుకుంటే.. 50 లక్షలుపైనే. ఇన్ని లక్షల బండ్లు నడవాలంటే కావాల్సింది పెట్రోల్, డీజిల్. 365 రోజులూ.. 24 గంటలూ డిమాండ్ ఉన్నది దీనికే. అలాంటి పెట్రోల్, డీజిల్ కొట్టే బంకుల్లో మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వందలసార్లు తనిఖీలు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. కళ్లకు కనిపించే మీటర్ ఒకటి అయితే.. బండిలోకి వచ్చే ఇంధనం మాత్రం చాలా తేడా ఉంటుంది. ఈ మోసాన్ని ఓ యువకుడు వెలుగులోకి తీసుకొచ్చి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే హైదరాబాద్ మొత్తం వైరల్ అయ్యింది. 3వేల 500 లైక్స్, 8,880 షేర్స్ తో ఫేస్ బుక్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నవంబర్ 7వ తేదీ తెల్లవారుజామున డేవిడ్ కుమార్ అనే వ్యక్తి.. యూసుఫ్ గూడలోని ఓ పెట్రోల్ బంకులో తన టూ వీలర్ కు ట్యాంక్ ఫుల్ గా పెట్రోల్ కొట్టించాడు. బంకు సిబ్బంది పెట్రోల్ పోస్తూనే ఉన్నారు. ఎంత అంటే 16.95 లీటర్లు కొట్టారు. ఆ బండి హోండా యూనికార్న్ 2013 మోడల్. ఇక్కడ వాస్తవం ఏంటంటే.. ఆ బండి ట్యాంక్ కెపాసిటీ కేవలం 13 లీటర్లు మాత్రమే. చిత్రంగా 16.95లీటర్ల వరకు మీటర్ చూపించింది. అప్పటికీ ట్యాంక్ ఫుల్ కాలేదు. దీంతో షాక్ అయిన డేవిడ్.. వాటికి సంబంధించిన బిల్లు, మీటర్ రీడింగ్ కూడా ఫొటోలు తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. లీటర్ కు కేవలం 800 పాయింట్లు మాత్రమే వస్తుందని.. 200ml కాజేస్తున్నారని లెక్కలు వేశాడు. తన దగ్గర దోపిడీ చేసిన 250 రూపాయలు వద్దని.. ఇలాంటి మోసాలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని కోరాడు. అందరూ పెట్రోల్ బంకుకి బాటిల్స్ తో వెళితే మంచిదని సూచించాడు…

Comments

comments

Share this post

scroll to top