“దుర్గామాతను” శృంగార వేశ్యతో పోలుస్తూ అతను ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు..అతని దుశ్చర్యకు తర్వాత ఏమైందో తెలుసా?

దేశంలో ఎన్నో మ‌తాలు, కులాల‌కు చెందిన వారు సామ‌ర‌స్యంగా జీవిస్తున్న‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం ఇంకా కులాలు, మ‌తాలు పేరిట స‌మాజంలోని ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చు పెట్టేందుకే య‌త్నిస్తున్నారు. అలాంటి వారి ఆగ‌డాలు ఎక్కువ రోజులు సాగ‌వు లెండి, అది వేరే విషయం. అయితే ఇటీవ‌లే ఇదే కోవ‌లో ఓ వ్య‌క్తి రెండు మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. అందుకు అత‌ను ఏం చేశాడంటే హిందూ దేవ‌త అయిన దుర్గామాత‌పై అస‌భ్య‌క‌ర పోస్ట్‌ను పెట్టి దాన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. దీంతో ఇప్పుడీ విష‌యం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం అయింది.

అత‌ను కేదార్ కుమార్ మండ‌ల్‌. ఢిల్లీ యూనివ‌ర్సిటీకి చెందిన ద్యాల్ సింగ్ కాలేజీలో హిందీ అసిస్టెంట్ ప్రొఫ‌స‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. అయితే తాజాగా జ‌రుగుతున్న ద‌స‌రా న‌వ‌రాత్రుల‌ను దృష్టిలో ఉంచుకుని అత‌ను ఈ నెల 22వ తేదీన త‌న ఫేస్‌బుక్ ఖాతాలో దుర్గాదేవిపై అస‌భ్య‌క‌ర పోస్టును పెట్టడు. అందులో Durga is the very much sexy prostitute in the Indian mythology అని ఉంది. దీంతో ఫేస్‌బుక్ లో పోస్టు చూసిన ఇత‌ర విద్యార్థులు, ఉపాధ్యాయులు కేదార్ కుమార్ పై లోధి రోడ్‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్ (ఏబీవీపీ)తోపాటు నేష‌న‌ల్ డెమొక్రాటిక్ టీచ‌ర్స్ ఫ్రంట్ కూడా కేదార్ కుమార్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేదార్ కుమార్‌పై కేసు న‌మోదు చేశారు. అత‌నిపై 153 ఎ (భిన్న‌మైన మ‌తాల‌కు చెందిన వారి మ‌ధ్య త‌గాదాలు పెట్ట‌డం, పెట్టేందుకు య‌త్నించ‌డం), 295ఎ (ఓ వ‌ర్గం మనోభావాల‌ను కించ ప‌రిచేలా పోస్టులు పెట్ట‌డం) సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. అత‌న్ని కాలేజీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘం నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా.. మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్టాల‌నుకునే, ఇత‌ర మ‌తాల‌ను కించ ప‌రిచే ఇలాంటి వ్య‌క్తుల‌ను ఏం చేయాలో మీరే చెప్పండి..!

Comments

comments

Share this post

scroll to top