రెండు సార్లు గడిపితే, ఒక సారి ఫ్రీ అంటూ మహిళపై అసభ్య కరపత్రాలు.! ఇద్దరి అరెస్ట్.

పరిచయమున్న వ్యక్తే ఆమె పరువు తీయాలని ప్రయత్నించాడు. అనుకున్నదే తడవుగా ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్న తన ఫ్రెండ్ సహాయం తీసుకొని ఆమెపై  అసభ్యరీతిలో 500 కరపత్రాలు ముద్రించి, ఆమె నివాసముంటున్న ప్రాంతంలో పడేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది, రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దర్ని అరెస్ట్ చేశారు.  పూర్తి వివరాల్లోకి వెళితే  నవనీత అనే వివాహిత తన భర్త చనిపోవడంతో నిజాంపేట్ లోని రాజీవ్ గృహకల్పతో నివాసం ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ లో నాచారంకు చెందిన   శ్రీపతి రవీందర్ (56)  నవనీత కు పరిచయమైనాడు,ఈ క్రమంలో రవీందర్ నవీనతతో చనువుగా ఉంటూ ఆమె  బాగోగులు చూస్తూ తరచూ ఆమె ఇంటికి వచ్చి పోతుండే వాడు, ఇటీవల నవనీత ఇతనిని ఇంటికి రావద్దని చెప్పటం తో కోపం పెంచుకొన్న రవీందర్ ఇమె ఉంటున్న కాలనీ లోనే ఆమెను అవమానించాలని నిర్ణయించుకొని ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్న తన స్నేహితుడు షబ్బీర్ ను సంప్రదించి ఆమెపై అసభ్యంగా కరపత్రాలు తయారుచేయాలని కోరటం తో………

fear

” నేను ఒంటరిగా ఉన్నాను నాతో ఎవరైనా గడపలనుకొంటే ఆసక్తి ఉన్నవారు ఈ నెంబర్ కు  సంప్రదించవలెను , దసరా దీపావళి ఆఫర్ అంటూ రెండు సార్లు గడిపితే ఒక సారి ఫ్రీ ” అంటూ 500 కరపత్రాలు తయారుచేసారు. వాటిని ఆమె నివాసముంటున్న కాలనీ పరిసర ప్రాంతాలలో పడేసారు ఇది గమనించిన మహిళ పోలీసులకు పిర్యాదు చేయడంతో రంగం లోకి దిగిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Comments

comments

Share this post

scroll to top