పోలీసులను చూడగానే ఏటీఎంలో దూరారు ఆ ఇద్దరమ్మాయిలు..ఎందుకో తెలుసా..?

డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందని తెలిసినా ఎలాగోలా తప్పించుకోవచ్చులే అన్నట్టు లైట్ తీసుకుంటారు కొందరు.కాని ఆఖరుకి దొరికిపోయి ఫైన్ కట్టడమో,కోర్టుకి అటెండ్ అవ్వడం వరకూ పరిస్థితి వెళ్లొచ్చు. అయినా ఎదురుగా పోలీసులు ఉన్నా కూడా ధైర్యంగా అంతపనీ చేశారు చూడండి..వాళ్లు తాగినందుకు తిట్టినా..అంత మత్తులోనూ ఎలా తప్పించుకోవాలా అని మైండ్ షార్ప్ గా పనిచేసింది చూడండి వాళ్ల తెలివిని చూసి ఔరా అనకుండా ఉండలేం..ఇంతకీ ఎవరు వాళ్లు ..ఏం చేశారు అంటారా..మరింకెందుకు ఆలస్యం చదివేయండి..

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఎప్పటిలాగే రాత్రి సమయంలో పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఇంతలో ఓ ఖరీదైన కారు ఆ రోడ్డు మీదకు వచ్చింది.బ్లాక్ టీషర్టు ధరించిన ఓ యువతి ఫుల్లుగా మందు తాగి, కాస్తంత తక్కువగా తాగిన తన మరో స్నేహితురాలితో కలసి ఆ కార్లో వస్తోంది.జూబ్లీహిల్స్ లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను నిర్వహిస్తున్న పోలీసులను దూరంగానే గమనించిన ఇద్దరూ , వెంటనే కారు పక్కన ఆపి, కిందకు దిగి… పోలీసులు వచ్చేలోగా పక్కనే ఉన్న ఏటీఎంలోకి వెళ్ళారు .ఎటిఎంలోకి వెళ్లడానికి ముందే ఒక స్నేహితుడికి కాల్ చేసి అక్కడికి రమ్మన్నారు.

కారు నుండి ఎవరో దిగిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా బ్లాక్ టీషర్ట్ ధరించిన అమ్మాయి కారు నడిపిందని గమనించారు.ఇంతకూ ఏటీఎం లోకి ఎందుకు దూరారనే కదా.. తమ దుస్తులను మార్చేసుకోడానికి. ఎందుకంటే ఫుల్ గా మద్యం తాగిన అమ్మాయి దొరికిందంటే పోలీసులు చర్యలు తీసుకుంటారు కాబట్టి..!కాల్ చేసి పిలిచిన తమ ఫ్రెండ్ రావడానికి  నిమిషం ముందు వీరిద్దరూ ఎటిఎం నుండి బయటకు వచ్చారు. వీరిని చూసిన పోలీసులు, కారును రోడ్డుపై ఎందుకు ఆపారని ప్రశ్నిస్తుండగానే, వీరి స్నేహితుడు వచ్చి కారు తనదని చెప్పాడు. అతనికి డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, బీఏసీ సున్నాగా చూపించింది.చేసేదేం లేక రాంగ్ పార్కింగ్ కింద ఫైనేసి పోలీసులు వెళ్లిపోయారు.

 

Comments

comments

Share this post

scroll to top