అర్జున్ రెడ్డి సినిమా తో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ రెడ్డి కి ఎంత పేరు వచ్చిందో, ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే కి కూడా అంతే పేరు వచ్చింది, మొదటి సినిమా అయిన కూడా చాలా బాగా చేసింది అనే పేరు వచ్చింది తనకి,, అర్జున్ రెడ్డి సినిమా తరువాత ఫుల్ బిజీ గా మారిపోయింది ఈ భామ, చేతినిండా ఆఫర్స్. కీర్తి సురేష్ ముఖ్య పాత్రలో నటించిన మహానటి చిత్రం లో సావిత్రమ్మ చిన్న నాటి స్నేహితురాలిగా నటించింది షాలిని పాండే , తమిళ్ లో హీరో జి.వీ.ప్రకాష్ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది, తెలుగు లో నాగ చైతన్య తమన్నా నటించిన 100% లవ్ చిత్రానికి రీమేక్ ఈ సినిమా. తెలుగు లో కల్యాణ్‌రామ్ సరసన ఒక థ్రిల్లర్‌లో నటిస్తోంది.
అయితే ఈ భామ ఇప్పుడు ఇన్స్టాగ్రామ లో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ ఏంటంటే “తినండి, ఎక్సర్సైజ్ చేయండి, నిద్రపొండి, పుస్తకాలు చదవండి, లేజీగా తిరగండి, సింపుల్‌గా అపుడపుడు ఏ పని చేయకుండా కూర్చొండి, ఫోన్ పక్కన పెట్టండి, బెడ్ మీద నుంచి కింద దిగకండా.. సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి. రూల్స్‌కి బ్రేక్ వెయ్యి.” ఇలా చేస్తే జీవితం సూపర్‌గా ఉంటుందట.