రీమేక్ అవ్వబోతున్న అర్జున్ రెడ్డి..బాలివుడ్లో అర్జున్ రెడ్డిగా ఎవరు యాక్ట్ చేస్తున్నారో తెలుసా..

అర్జున్ రెడ్డి ..ఇటివల ఇంత హైప్ ఏ  సినిమాకి క్రియేట్ కాలేదంటే అతిశయోక్తి కాదు.ట్రైలర్,టీజర్ ,పోస్టర్ దేనికవే విభిన్నంగా వచ్చి ప్రేక్షకులను ఆకర్శించాయి.మరోవైపు కొంతమంది విమర్శలను ఎదుర్కొన్నాయి.కానీ ఎంతమంది విమర్శించిన అర్జున్ రెడ్డి సినిమా హిట్ ని ఎవరూ ఆపలేకపోయారు.రియలిటికి దగ్గరగా ఉందని చాలామంది సినిమాని పొగిడితే పర్వర్టెడ్ గా ఉందని కొందరు విమర్శించారు కూడా..ఏదేమైనప్పటికి సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయింది.తెలుగు సినిమా స్థాయిలో ఇలాంటి సినిమా రావడం ఒక సంచలనం గా మారింది..

అర్జున్ రెడ్డి చూసి ఫిదా అవుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతూ పోతోంది. మూవీ విడుదలైన తెల్లారే రామ్ గోపాల్ వర్మ.. సినిమాను తన ట్వీట్లతో ఆకాశానికెత్తేశాడు. రియల్ పవర్ స్టార్ అని విజయ్ దేవరకొండకు బిరుదు ఇవ్వాలని ఇండస్ట్రీకి సూచించాడు. తర్వాత.. ఎస్ఎస్ రాజమౌళి కూడా.. సినిమా యూనిట్ ను అభినందించాడు.  మహేష్ బాబు,  సమంత కూడా అర్జున్ రెడ్డి అదుర్స్ అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చేశారు. దీంతో మూవీపై హైప్ మరింతగా పెరుగుతూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.సినిమా అద్భుతమని తెలియడంతో.. మిగతా భాషల్లోని బడా హీరోలు.. అర్జున్ రెడ్డిపై ఆసక్తి చూపించడం మొదలు పెట్టారు. చిన్న సినిమాగా వచ్చి.. వారంలోనే.. 31 కోట్ల భారీ మొత్తం వసూలు చేయడంతో.. అర్జున్ రెడ్డి.. టాక్ ఆఫ్ ద నేషన్ అవుతున్నాడు.


హిందీలో అర్జున్ రెడ్డి పాత్రలో బాలీవుడ్ అగ్రనటుడు రణ్‌వీర్ సింగ్ నటించనున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈసినిమాను ముందుగా రణ్‌వీర్ ప్రత్యేక షో ద్వారా చూడనున్నారట..మరోవైపు విఐపి 2 అంటూ వచ్చిన ధనుష్ హిట్ ను అందుకోలేకపోయారు.అర్జున్ రెడ్డి రీమేక్ ద్వారా అయినా తమిళ్ ఇండస్ట్రీలో మళ్లీ హిట్ టాక్ తెచ్చుకోవాలని చూస్తున్నారట.. ఇప్పటికే అర్జున్ రెడ్డిలో విజయ్ చాలా సహజనటనతో అభిమానులను సంపాదించుకున్నారు.మరి రీమేక్ లో ధనుష్,రణవీర్ సింగ్ ఎలా నటిస్తారో వేచి చూడాలి..

Comments

comments

Share this post

scroll to top