“అర్జున్ రెడ్డి” డైరెక్టర్ “సందీప్ వంగా” నెక్స్ట్ సినిమా ఏంటో తెలుసా.? టైటిల్ వింటేనే ఏదో ఉందని అర్ధమవుతుంది!

సందీప్ రెడ్డి వంగా…కొన్ని నెలల క్రితం వరకూ ఈ పేరు ,ఈ మనిషి ఎవరికీ తెలీదు.కానీ ఇప్పుడు ఈ పేరు తలవని వారుండరు..మూసధోరణితో పోతున్న తెలుగు సినిమా చెంపలు పగలకొట్టి తన స్టైల్లో సినిమా తీసి సత్తా చాటాడు..బోల్డ్ సినిమా అన్నారు,బూతు సినిమా అన్నారు ఎన్ని విమర్శలొచ్చినా సినిమా మాత్రం సూపర్ హిట్..నైట్ కి నైటే సందీప్ రెడ్డి స్టార్ అయ్యాడు..అప్పటివరకూ సినిమా తీయడానికి హీరోల చుట్టూ తిరిగిన ఆయన..తనతో సినిమా తీయాలని హీరోలు అనుకునే స్థాయికి తీసుకెళ్లింది అర్జున్ రెడ్డి..ఇప్పుడు అందరి ఆలోచన సందీప్ సెకండ్ సినిమా ఏంటి అనేదానిపైనే…!

అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తరువాత ఆయన చేయబోయే సినిమా ఏంటా అన్నదే ఇప్పుడు ఎవరికీ అంతుపట్టకుండా ఉండింది. దానికి తగట్టే సందీప్ రెడ్డి సైలెన్స్ మెయింటైన్ చేయడంతో సస్పెన్సు పెరుగుతూ పోతుంది. సమాచారం ప్రకారం సందీప్ రెడ్డికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది.. అదే  క్రైమ్ థిల్లర్..సినిమా పేరు షుగర్ ఫ్యాక్టరి. అర్జున్ రెడ్డి కన్నా ముందు షుగర్ ఫ్యాక్టరీ సినిమా తీయాలని అనుకున్నాడట సందీప్ కానీ ఎవరికి కథ వినిపించినా ఇంత ఇంటిలిజెన్స్ తో అవసరమా అంటే లవ్ స్టోరీ రాసుకున్నాడట..దానికి కూడా ఇంత బొల్డ్ నెస్ అవసరమా అనే ప్రశ్న రావడంతో ఆ సినిమాకు తన అన్ననే ప్రొడ్యూసర్ గా పెట్టి సినిమా తీశాడు.హిట్ కొట్టాడు..

ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కూడా నిర్మాతలు,హీరోలు సిద్దంగా ఉన్నప్పటీకి ఈ సినిమాను తనే ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాడట.. హీరో ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు…టైటిల్ వింటుంటేనే ఏదో విషయం ఉంది అనిపిస్తుంది కదా…మరి ఈ సినిమాను ఎవరితో తెరకెక్కిస్తారో వేచిచూద్దాం…

Comments

comments

Share this post

scroll to top