మిన‌ర‌ల్ వాట‌ర్, కూల్ డ్రింక్స్ బాటిల్స్‌ను ప‌దే ప‌దే వాడుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌. ఎందుకో తెలుసా..?

ఏ కూల్ డ్రింక్‌కు చెందిన బాటిల్‌ను తెచ్చుకుని అందులోని డ్రింక్‌ను తాగినా చాలా మంది త‌రువాత ఏం చేస్తారంటే.. ఖాళీ అయిన ఆ కూల్ డ్రింక్ బాటిల్‌ను ప‌డేయ‌రు. మ‌ళ్లీ వాడుతారు. ఎక్కువ‌గా అలాంటి ఖాళీ కూల్‌డ్రింక్ బాటిల్స్‌ను అనేక మంది నీటిని తాగేందుకు వాడుతారు. అయితే నిజానికి అలా వాడ‌డం శ్రేయ‌స్క‌రం కాదు. దీర్ఘ‌కాలికంగా అలాంటి బాటిల్స్‌ను వాడితే ఆరోగ్యానికి చాలా హాని క‌లుగుతుందని ప‌లువురు సైంటిస్టులు తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆ బాటిల్స్ వ‌ల్ల ఎలాంటి హాని క‌లుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

తాగునీటిని అమ్మే మిన‌ర‌ల్ వాట‌ర్ బాటిల్స్ లేదా కూల్ డ్రింక్ బాటిల్స్‌ను పాలీఎథిలీన్ టెరెఫ్తాలేట్ (పెట్ – PET) అనే కెమిక‌ల్ తో త‌యారు చేస్తారు. అందువ‌ల్ల ఈ బాటిల్స్‌ను ఒక‌సారికి మించి వాడ‌కూడ‌దు. బ‌య‌ట మ‌నం వాట‌ర్ బాటిల్ లేదా కూల్‌డ్రింక్ బాటిల్‌ను కొంటే అందులోని ద్ర‌వాల‌ను తాగాక వెంట‌నే బాటిల్స్‌ను ప‌డేయాలి. అంతేకానీ వాడ‌కూడ‌దు. అలా వాడితే ఆ బాటిల్స్ ఎండలో ఉన్న‌ప్పుడు వ‌చ్చే వేడికి వాటిలో నుంచి ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాలు బాటిల్‌లో ఉండే ద్ర‌వంలో క‌లుస్తాయి. ఈ క్ర‌మంలో ఆ ద్ర‌వాన్ని తాగితే ప్ర‌మాద‌క‌ర‌మైన, ప్రాణాంత‌క‌మైన వ్యాధులు వ‌స్తాయి.

అలా ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఉండే నీటిని తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్‌, డ‌యాబెటిస్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అధికంగా బ‌రువు కూడా పెరుగుతార‌ట‌. మ‌హిళ‌ల్లో హార్మోన్ల స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. దీంతో వారికి పీరియ‌డ్స్ స‌రిగ్గా రావు. సంతానం పొందాల‌నుకునే వారికి ఇబ్బంది క‌లుగుతుంది. బ్రెస్ట్ క్యాన్స‌ర్ కూడా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని డాక్ట‌ర్ మెరిలిన్ గ్లెన్‌విల్లె అనే వైద్యుడు చెబుతున్నాడు. అంతేకాకుండా ఎక్కువ రోజుల పాటు అలాంటి ప్లాస్టిక్ బాటిల్స్‌ను వాడితే వాటిలో ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ.కొలి బాక్టీరియా పెరుగుతుంద‌ని, దాంతో డ‌యేరియా, వాంతులు, విరేచ‌నాలు, జ్వ‌రం వంటి అనారోగ్య‌లు క‌లుగుతాయ‌ని చెబుతున్నారు. క‌నుక మీరు కూడా అలాంటి మిన‌ర‌ల్ వాట‌ర్‌, కూల్ డ్రింక్ బాటిల్స్‌ను వాడుతుంటే వెంట‌నే వాటి వాడ‌కాన్ని ఆపేయండి. లేదంటే తెలుసు క‌దా, అనారోగ్య‌లు క‌లుగుతాయి.

Comments

comments

Share this post

scroll to top