ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి వయసు రెండేళ్లు. ఇండినేషియా లో నివాసం. పేరు ఆర్ధిరిజాల్. వీరలెవల్లో ఫోటోలకు ఫోజిస్తు ఉఫ్ ఉఫ్ మంటు సిగరెట్లు తాగేస్తున్నాడు. రోజుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 సిగరెట్లకు పైనే లాగించేస్తున్నాడు ఈ బుడ్డోడు. చిన్న వయసులోనే ఈ రేంజ్ లో పొగ తాగుతుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సిగరెట్లు మానిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.సరిగ్గా అదే సమయంలో ఈ బుడ్డోడి ఫోటో ఆన్ లైన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నోట్లో సిగరెట్ తో కనిపిస్తున్న ఈ అబ్బాయి ఫోటో వైరల్ గా మారింది.
సీన్ కట్ చేస్తే 8 ఏళ్ల తరువాత ఈ ఫోటో. 10 ఏళ్ల వయస్సున్న ఆర్థి రిజాల్ గుర్తు పట్టనంతగా మారిపోయాడు. సిగరెట్ అలవాటు కూడా పూర్తిగా మానేశాడు. అదేలా సాధ్యం అయిందంటే కేవలం ఆత్మవిశ్వాసం తోనే. తన డాక్టర్ చెప్పిన సూచనలను పాటించడంతో ఆర్థి పూర్తిగా సిగరెట్లను మానేశాడు. మానేయడం మాత్రమే కాదు, ఇంకెవరు కూడ సిగరెట్లు తాగొద్దని.. తాగితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో చెపుతున్నాడు. ఎవరైనా బలవంతగా సిగరెట్ చేతికిస్తే.. థ్యాంక్స్ టూ మై డాక్టర్ అంటూ చిరునవ్వుతో పలకరించేవాడు. వ్యసనంగా మారిన అలవాటును మార్చుకునేందుకు వాకింగ్ ను , డ్యాన్స్ ను ఇష్టంగా మలుచుకోవడంతోనే ఆర్థి ఇంత స్మార్ట్ గా తయారయ్యాడని తన డాక్టర్ చెపుతున్నాడు. ఆరోగ్యం గా ఉండాలన్నా ఎక్కువ రోజులు బ్రతకాలన్న చెడు వ్యసనాలకు దూరంగా ఉండక తప్పదు. వ్యవసనాలను మానేసేందుకు వాకింగ్ , సైక్లింగ్, డ్యాన్స్, క్రికెట్, రన్నింగ్, పుట్బాల్, టెన్నిస్, బ్యాట్మింటన్ ఇలా మీకిష్టమైన దానిని వ్యవసనంగా మార్చుకుంటే శరీరానికి మరీ మంచిదని చెపుతున్నాడు ఆర్థి. మరీ ఆర్థి చెప్పింది ఫాలో అవుదామా.!.