ఇండియా గురించి సౌధీ మేధావి ఇలా రాశాడు..! అతనికున్న అవగాహన మనకెందుకు కరువైందీ.?

ఇవి , ఓ సౌధీ అరేబియా మేధావి,  సౌధీ గెజిట్ అనే పత్రికకు రాసిన వ్యాసంలోని అంశాలు :
“భారతదేశంలో వంద కన్నా ఎక్కువ మతాలున్నాయి. వందకన్న ఎక్కువ భాషలున్నాయి. అయినా అక్కడి ప్రజలు ఎంతో సంయమనంతో శాంతియుత జీవనం సాగిస్తున్నారు. బట్టలు కుట్టుకునే సూది దగ్గర్నుంచీ అంగారక గ్రహంపైకి పంపించిన ఉపగ్రహం వరకు ఏదైనా తయారు చేయగలిగే గొప్ప దేశంగా ఎదగడం కోసం అక్కడి వారందరూ కలసి శ్రమిస్తున్నారు.

“భారతదేశాన్ని, అక్కడి ప్రజల శాంతియుత సహజీవనాన్ని చూస్తుంటే నాకు కాస్త అసూయ కలుగుతుంది. ఎందుకంటే నేను ఒకే మతాన్ని పాటించే, ఒకే భాషను మాట్లాడే దేశంలో జన్మించేను. ప్రజలంతా ఒకే మతానికి, భాషకు చెందిన వారైనా మా దేశంలో ఎప్పుడూ అల్లర్లు, హత్యాకాండలు జరుగుతూంటాయి.

Less-known-char27380

“ప్రపంచంలో వివిధ దేశాధినేతలు శాంతి, సహనం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం మనం చూస్తుంటాం. కానీ మతము, భాష, ప్రాంతం, వర్గం వంటి భేధాలేవీ లేకుండా అతి ప్రాచీన కాలం నుండీ శాంతియుత సహజీవనాన్ని ఆచరణాత్మకంగా ప్రపంచానికి చూపించిన దేశం ఒక్క భారతదేశం మాత్రమే.

“కానీ చాలా దేశాలలో ఈ వాస్తవాన్ని ప్రక్కనపెట్టి భారతదేశాన్ని పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న దేశంగానే ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా అసమంజసమైనది, అవాస్తవమైనది.

“ఈ భూమండలంపై అత్యంత సహనం గల ఏకైక దేశం ఒక్క భారతదేశం మాత్రమే.

11

“పెట్రోలియం యుగం ప్రారంభం కాక ముందు అరబ్బు దేశాలు చాలా పేద దేశాలు. అప్పుడు అరబ్బులమైన మన దృష్టిలో భారతీయులంటే చాలా ధనవంతులు, నాగరికులు. కానీ ధనవంతులైన మరుక్షణం మన దృష్టిలో భారతదేశం అంటే పేదరికంలో మగ్గిపోతూ వెనుకబడిపోయిన దేశం ఎలా అయిపొయింది? ఇలా భారతదేశం పట్ల క్షణాలలో మన అభిప్రాయం మారిపోవడంలో ఔచిత్యం ఏముంది?

“అసలు మనమెప్పుడూ భారతీయులు పేదవారా, ధనికులా అనే ఆలోచిస్తుంటాం. నిజంగా మనకు జ్ఞానం ఉంటే పరస్పర విరుద్ధమైన ఆదర్శాలను, ఆలోచనలను ఎలాంటి భావోద్వేగాలు, సంశయాలు లేకుండా స్వాగతించి, విభిన్న ఆలోచనలు కలవారితో వందల సంవత్సరాలుగా శాంతియుతంగా సహజీవనం చేస్తూన్న భారతదేశం నుండి మనం ఎంతో నేర్చుకుని ఉండేవారం.

“ఒకవేళ మొత్తం అరబ్బు దేశాలలో ఉన్నవారందరినీ భారతదేశానికి తరలించినట్లయితే వారంతా భారతదేశంలో ఒక చిన్న భాగం మాత్రమే అవుతారు. మానవత్వం అనే మహాసాగరంలో ఎలాంటి భయసంకోచాలూ లేకుండా వారు కలిసిపోగలరు. వారిలోని జాత్యహంకారం పూర్తిగా లయమైపోతుంది. ఈ ప్రపంచంలో అన్నదమ్ముల్లా బ్రతకాల్సిన వాళ్ళు ఒకరినొకరు చంపుకోవడం ఏమాత్రం సమ్మతం కాదని తెలుసుకుంటారు.

solar-system-11111_640

“భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద అతి ప్రాచీనమైన ప్రజాస్వామ్య దేశం. మత, జాతి, ప్రాంత, భాషా భేదాలంటే భారతీయులకు తెలియదు. ఎందుకంటే వైవిధ్యాలతో సహజీవనం చేయగలిగే లక్షణం వారి జన్యువులలోనే ఉంది సహజంగా.

“భారతీయులు ఏనాడూ పేదవారి పట్ల రోత, ధనికుల పట్ల ద్వేషము చూపలేదు.

భారతీయులు చాలా గొప్పవారు. వారిలో ఎన్నో రకాల ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలో ఎవరూ దీనిని త్రోసివేయలేరు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే అందుకు వారిలో భారతీయుల పట్ల కల ఈర్ష్యయే కారణం. దానికి వారు ఎంతో సిగ్గుపడాలి.

“ఒకవేళ అరబ్బులే భారతదేశానికి వెళ్తే భయపడాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళు భారతీయుల మనసులను ఎక్కడ కలుషితం చేస్తారోనన్నదే. వారు భారతీయులలో మతపరమైన, ప్రాంతీయపరమైన విద్వేషాలకు ఎక్కడ ఉసిగొల్పుతారన్నదే. అంతేకాదు భారతీయులలో గల వైవిధ్యాలను ఆధారంగా చేసుకొని వాళ్ళు ఒకరినొకరు చంపుకునేంత వరకు రెచ్చగొడతారు కూడా.”

Source: Vinith Kumar Goud.

Comments

comments

Share this post

scroll to top