సాఫ్ట్‌వేర్ కంపెనీ యాపిల్ లోగోను ఎలా డిజైన్ చేశారో తెలుసా..? ఇప్పటివరకు ఎన్ని సార్లు మారిందో తెలుసా..?

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ గురించి అంద‌రికీ తెలిసిందే. మాక్ పీసీ, మాక్ బుక్, ఐఫోన్‌, ఐప్యాడ్, ఐపాడ్, యాపిల్ వాచ్ వంటి అనేక టెక్నాల‌జీ డివైస్‌ల‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసి యూజ‌ర్ల‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. కాగా యాపిల్ కంపెనీని స్టీవ్ జాబ్స్ స్థాపించారు. ఇప్పుడు టిమ్ కుక్ ఈ కంపెనీకి సీఈవోగా ఉన్నారు. అయితే మీకు తెలుసా..? యాపిల్‌కు చెందిన అన్ని ఉత్ప‌త్తుల‌పై యాపిల్ లోగో ఉంటుంది క‌దా..! అదేనండీ… ఓ వైపు యాపిల్ కొద్దిగా కొర‌క‌బ‌డి ఉంటుంది. యాపిల్ మొద‌ట స్థాపించ‌బ‌డిన‌ప్ప‌టి నుంచి ఇదే లోగో ఉంది. అయితే ఈ లోగోను క్రియేట్ చేయ‌డం వెనుక ఉన్న అస‌లు క‌థ ఏంటో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

స్టీవ్ జాబ్స్ యాపిల్ కంప్యూట‌ర్స్ సంస్థ‌ను స్థాపించాక ఆ కంపెనీ లోగోను క్రియేట్ చేయ‌ద‌ల‌చుకున్నారు. అందుకు గాను రోనాల్డ్ వాయ్‌నె అనే గ్రాఫిక్ డిజైన‌ర్‌ను సంప్ర‌దించారు. అయితే అత‌ను అప్ప‌ట్లో ఏం లోగో డిజైన్ చేశాడంటే… ఐజాక్ న్యూట‌న్ యాపిల్ చెట్టు కింద కూర్చుని ఉండ‌గా ఆయ‌న త‌ల‌పై ఓ యాపిల్ ప‌డుతూ ఉంటుంది. దీన్నే అత‌ను లోగోగా గీశాడు. అయితే అది స్టీవ్‌కు న‌చ్చ‌లేదు. దీంతో ఆయ‌న మ‌రో గ్రాఫిక్ డిజైన‌ర్‌ను సంప్ర‌దించారు.

రాబ్ జ‌నోఫ్ అనే గ్రాఫిక్ డిజైన‌ర్ కు యాపిల్ లోగోను డిజైన్ చేయ‌మ‌ని స్టీవ్ జాబ్స్ చెప్పారు. దీంతో అత‌ను ప‌చ్చ‌ని యాపిల్ పండును కొద్దిగా కొరికిన‌ట్టుగా గీశాడు. దీంతో ఆ డిజైన్ స్టీవ్‌కు న‌చ్చింది. అయితే ఆ పండులో మొత్తం ఆకుప‌చ్చ ద‌నం ఉండ‌డం స్టీవ్ జాబ్స్‌కు న‌చ్చ‌లేద‌ట‌. దీంతో ఆయ‌నే స్వ‌యంగా ఆ పండులో ఇంద్ర ధ‌నుస్సు (రెయిన్‌బో) రంగుల‌ను యాడ్ చేశార‌ట‌. ఆ త‌రువాత ఆ రంగులు పోయి ప్లెయిన్ క‌ల‌ర్‌లోకి యాపిల్ లోగో మారింది. అదీ… యాపిల్ కంపెనీ లోగో వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యం.

అయితే రాబ్ జ‌నోఫ్ అలా యాపిల్‌ను ఎందుకు కొరికిన‌ట్టుగా డిజైన్ చేశాడు అనే దానికి ప‌లువురు అత‌న్ని ప్ర‌శ్న‌లు అడిగార‌ట‌. అందుకు గాను రాబ్ ఏమ‌ని స‌మాధానం చెప్పాడంటే… యాపిల్‌ను అలా కొరికిన‌ట్టుగా కాకుండా మామూలుగా ఉంచితే అది ట‌మాటాను పోలి ఉంద‌ట‌. దీంతో చూసేవారు ఆ లోగోను ట‌మాటా అనుకుంటార‌ని, అందుకే యాపిల్‌ను కొద్దిగా కొరికిన‌ట్టు వేశాన‌ని రాబ్ జ‌నోఫ్ చెప్పాడు. ఏది ఏమైనా యాపిల్ లోగో అలా రూపాంత‌రం చెంద‌డం ఆ త‌రువాత ఆ కంపెనీ విజ‌యాల బాట ప‌ట్ట‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మే మ‌రి. అవును, యాపిల్ లోగో ఫోన్ వెనుక ఉంటే అదొక ప్రెస్టీజ్ ఇష్యూ అని భావించే వారు చాలా మందే ఉన్నారు. అందుకే చాలా మంది ఐఫోన్ల ప‌ట్ల ఆస‌క్తిని చూపుతారు. అది నిజ‌మే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top