ఆపిల్, గూగుల్ “బర్గర్ల” మధ్య ఉన్న ఈ తేడాను అతను పోస్ట్ చేసాడు..”గూగుల్ CEO” ఇచ్చిన కౌంటర్ హైలైట్!

యాపిల్‌.. గూగుల్‌.. ఇవి రెండూ పేరుగాంచిన సాఫ్ట్‌వేర్ సంస్థ‌లు. వీటి ఉత్పత్తుల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. అయితే ప్ర‌స్తుతం ఈ రెండింటికీ సంబంధించిన చ‌ర్చ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ గా న‌డుస్తోంది. ఏమీ లేదండీ.. మీకు బ‌ర్గ‌ర్ తెలుసు క‌దా. అందులో ట‌మాటా, ఆనియ‌న్స్‌, చీజ్‌, లెట్యూస్‌, ప్యాటీ ముక్క‌ల‌ను పెడ‌తారు. అయితే అదే బ‌ర్గ‌ర్ ఎమోజీ ఐకాన్‌ యాపిల్‌, గూగుల్ కు చెందిన ఉత్ప‌త్తుల్లో మ‌న‌కు క‌నిపిస్తుంది. ఈ క్ర‌మంలోనే యాపిల్, గూగుల్ లు త‌మ త‌మ డివైస్‌ల‌లో పెట్టిన బ‌ర్గ‌ర్ ఎమోజీ ఐకాన్ల‌పైనే ఇప్పుడు చ‌ర్చంతా న‌డుస్తోంది. ఎందుకంటే… వాటిల్లో ఉన్న చిన్న తేడా వ‌ల్లే. అది కూడా కేవ‌లం చీజ్ స్లైస్ ప్లేస్‌మెంట్ వ‌ల్లే ఈ చ‌ర్చంతా న‌డుస్తోంది.

యాపిల్ డివైస్‌ల‌లో ఉండే బ‌ర్గ‌ర్ ఎమోజీ ఐకాన్‌ను చూస్తే అందులో ట‌మాటా, ప్యాటీ ముక్క‌ల మ‌ధ్య‌లో చీజ్ స్లైస్ ఉంటుంది. అదే గూగుల్ కు చెందిన డివైస్‌ల‌లో ఉండే బ‌ర్గ‌ర్ ఎమోజీ ఐకాన్‌లో ట‌మాటా, ప్యాటీల కింద చీజ్ స్లైస్ ఉంటుంది. ప్ర‌స్తుతం ఇదే విష‌యంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది. ఆ రెండు ఎమోజీ ఐకాన్లు తేడాగా ఎందుకు ఉన్నాయి ? అంటూ బేక్‌డ‌ల్ మీడియా అనే సంస్థ‌కు చెందిన ఫౌండ‌ర్ థామ‌స్ బేక్‌డ‌ల్ మొద‌ట త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఓ ట్వీట్ చేశారు. అందులో యాపిల్‌, గూగుల్ బ‌ర్గ‌ర్ ఎమోజీ ఐకాన్ల ఫొటోల‌ను పెట్టారు. దీంతో అవి కాస్తా వైర‌ల్ అయ్యాయి.

అలా థామ‌స్ బేక్‌డ‌ల్ ఉంచిన ట్వీట్లు వైర‌ల్ అయి గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ దాకా విష‌యం చేరింది. దీంతో పిచాయ్ స్పందించి… ముందు ఈ బ‌ర్గ‌ర్ ఎమోజీ ఐకాన్‌లో చీజ్ ప్లేస్‌మెంట్ గురించి చ‌ర్చిద్దాం, మిగిలిన ప‌నులు తరువాత చేద్దాం.. అని ట్వీట్ చేశారు. దీంతో పిచాయ్ ట్వీట్ వైర‌ల్ అయింది. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యంపై పెద్ద ఎత్తున డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. అస‌లు బ‌ర్గ‌ర్‌లో చీజ్ స్లైస్ ఎక్క‌డుండాలి ? అనే అంశంపై నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఈ స‌మ‌స్య‌కు వార ప‌రిష్కారం క‌నుక్కుంటారా ? లేదా ? అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది. ఏది ఏమైనా బ‌ర్గ‌ర్‌లో చీజ్ ముక్క ఎక్క‌డుంటే ఏమిటి ? దాని రుచేం మార‌దు క‌దా..! ఈ విష‌యంలో మీరేమంటారు..!

Comments

comments

Share this post

scroll to top