6 వేల రూపాయ‌ల‌కే….. i-Phone.!?

ఐఫోన్ ఎస్ఈ. యాపిల్ సంస్థకు చెందిన ఓ ఐఫోన్ మోడ‌ల్ ఇది. 2016వ సంవ‌త్స‌రం మార్చి నెల‌లో విడుద‌లైంది. 16/32/64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో యూజ‌ర్ల‌కు ల‌భిస్తోంది. అయితే ఈ ఫోన్‌కు చెందిన 32జీబీ వేరియెంట్‌పై ప్ర‌స్తుతం ఆఫ‌ర్ల వెల్లువ న‌డుస్తోంది. అది కూడా పేటీఎం మాల్ వెబ్‌సైట్‌లో. అవును ఈ ఫోన్ ధ‌ర రూ.27,200 ఉండ‌గా డిస్కౌంట్ వ‌ల్ల రూ.22,990 కే ల‌భిస్తోంది. అయితే రేట్ ఇదే అయినా దీన్ని కేవలం రూ.6వేల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అది ఎలాగో తెలుసా..?

ఐఫోన్ ఎస్ఈ 32 జీబీ మోడ‌ల్ ధ‌ర ప్ర‌స్తుతం రూ.27,200గా ఉంది. అయితే స్వాతంత్ర్య దినోత్స‌వ ఆఫ‌ర్‌లో భాగంగా దీనిపై యూజ‌ర్ల‌కు 15 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భిస్తోంది. దీంతో ఫోన్‌ను రూ.22,990లకే కొనుగోలు చేయ‌వ‌చ్చు. అయితే ఇదే కాదు, ఇంకా మరిన్ని ఆఫ‌ర్లు కూడా ఈ ఫోన్‌పై ల‌భిస్తున్నాయి. అవేమిటంటే… ఫోన్‌ను కొన్న త‌రువాత 24 గంట‌ల‌కు యూజ‌ర్ పేటీఎం వాలెట్‌కు రూ.3వేల క్యాష్ వ‌స్తుంది. రూ.3వేలు వాలెట్‌లో జ‌మ అవుతాయి. ఇక దీంతోపాటు రూ.9వేల విలువైన బై బ్యాక్ గ్యారంటీ ల‌భిస్తోంది. దీని వ‌ల్ల ఏడాది లోపు ఫోన్‌ను మ‌ళ్లీ ఎప్పుడు అమ్మినా రూ.9వేలు క‌చ్చితంగా వ‌స్తాయి.

ఇక ఇవే కాకుండా ఫోన్‌తోపాటు రూ.2వేల విలువైన ఫ్లైట్ వోచ‌ర్‌, రూ.2వేల ఫ్యాష‌న్ కూప‌న్‌, రూ.1000 మొబైల్ యాక్స‌స‌రీస్ కూప‌న్లు ల‌భించ‌నున్నాయి. పైన ఇచ్చిన ఆఫ‌ర్ల‌తోపాటు వీటిని కూడా క‌లిపితే మొత్తం 3000+2000+2000+1000 = రూ.8వేలు అవుతుంది. దీనికి రూ.9వేల బై బ్యాక్ గ్యారెంటీ క‌లిపితే అప్పుడ‌ది రూ.17వేలు అవుతుంది. దీన్ని రూ.22,990లోంచి తీసేయండి. అప్పుడు రూ.5,990 అవుతుంది. అంటే ఐఫోన్ ఎస్ఈ 32 జీబీ మోడ‌ల్ మ‌న‌కు రూ.6వేల‌కే వ‌చ్చిన‌ట్ట‌వుతుంది. ఇదీ ఫోన్ ఆఫ‌ర్ వెనుక ఉన్న అస‌లు క‌థ‌. అయితే క్యాష్ ఆన్ డెలివ‌రీ రూపంలో కొంటే ఈ ఆఫ‌ర్లు వ‌ర్తించ‌వు.

ఐఫోన్ ఎస్ఈ ఫీచ‌ర్లు…
4 ఇంచ్ డిస్‌ప్లే, 640 x 1136 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, యాపిల్ ఎ9 డ్యుయ‌ల్ కోర్ ప్రాసెస‌ర్‌, 16/32/64/128 జీబీ స్టోరేజ్‌, 2 జీబీ ర్యామ్‌, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 1.2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్, 1624 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 4జీ వీవోఎల్‌టీఈ.

Buying Link — > https://paytm.com/offer/iphone-se/

Comments

comments

Share this post

scroll to top