వినియోగ‌దారుల కోర్టు ఝ‌ల‌క్‌: ఇకపై ఆ ఫోన్ అమ్మితే నష్టపరిహారం చెల్లించాల్సిందే..! ఎందుకో తెలుసా.?

స‌మ‌స్య ఉన్న ఫోన్ల‌ను అమ్మితే చివ‌ర‌కు కంపెనీల‌కే కాదు, ఆ కంపెనీల‌కు చెందిన డీల‌ర్ల‌కు షాక్ త‌గులుతుంది. అలాగే యాపిల్ కంపెనీకి తాజాగా షాక్ త‌గిలింది. అది కూడా ఓ ఐఫోన్ విష‌యంలో. ఓ క‌స్ట‌మ‌ర్‌కు స‌మ‌స్య ఉన్న ఐఫోన్ ను అమ్మారు. అత‌ను ఆ ఐఫోన్‌ను 3 సార్లు కొత్త ఐఫోన్ల‌తో మార్చుకున్నాడు. అయినా చివ‌ర‌కు ఆ ఐఫోన్ అలాగే ప‌నిచేస్తుండ‌డంతో చివ‌ర‌కు కోర్టులో కేసు వేయ‌గా కోర్టు అత‌నికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ ఘ‌ట‌న రాజ్‌కోట్‌లో జ‌రిగింది.

గుజరాత్‌లోని సౌరాష్ట్ర ధరోజీ టౌన్‌లో నివాసం ఉండే ఇక్బాల్ దంధల్ అనే ఓ విద్యార్థి 2015లో రూ.54వేలు వెచ్చించి ఓ ఐఫోన్‌ను కొన్నాడు. దీంతోపాటు ఫోన్‌కు అదనపు సొమ్ము చెల్లించి డిసెంబర్ 2017 వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీ పొందాడు. అయితే ఇక్బాల్ కొన్న ఐఫోన్ కొద్ది నెలలకే సతాయించడం మొదలు పెట్టింది. విషయాన్ని లోకల్ యాపిల్ డీలర్ దృష్టికి తీసుకెళ్లగా వారు ఆ ఫోన్‌ను మార్చి అదే మోడల్‌కు చెందిన కొత్త ఐఫోన్‌ను ఇచ్చారు. అయితే రెండోసారి కూడా ఆ ఐఫోన్‌లో సమస్య వచ్చింది. దీంతో మళ్లీ ఇక్బాల్ ఫోన్‌ను మార్చాడు. అయినా అతని అదృష్టం బాగా లేకపోవడంతో ఆ ఫోన్ కూడా సమస్య వచ్చింది. దీంతో డీలర్ మూడో సారి కొత్త ఫోన్ ఇవ్వబోయాడు. అయితే అందుకు ఇక్బాల్ ఒప్పుకోలేదు. తాను కొన్న ఐఫోన్ మోడల్ సరిగ్గా పనిచేయడం లేదని కనుక ఆ మోడల్ ఐఫోన్ తనకు అక్కర్లేదని, అదనపు సొమ్ము చెల్లిస్తానని తనకు కొత్త ఐఫోన్ మోడల్ ఇవ్వాలని కోరాడు. ఇందుకు డీలర్ స్పందించలేదు. దీంతో ఇక్బాల్ యాపిల్ ఇండియా కంపెనీతోపాటు ఆ డీలర్‌పై రాజ్‌కోట్ కన్‌జ్యూమర్ కోర్టులో కేసు వేశాడు. కేసు విచారణ కొనసాగించిన న్యాయస్థానం ఇక్బాల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఫోన్లలో సమస్య వస్తే వాటిని తిరస్కరించి కొత్త మోడల్ ఫోన్లను కోరే హక్కు వినియోగదారులకు ఉంటుందని అలా కుదరని పక్షంలో ఆ మేర ఫోన్ ఖరీదుకు అయ్యే మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు చెప్పింది. ఇక్బాల్ విషయంలో అతని నుంచి అదనపు సొమ్ము తీసుకుని లేటెస్ట్ మోడల్ ఐఫోన్‌ను ఇవ్వాలని, అలా కుదరకపోతే రూ.54వేలతోపాటు వినియోగదారుడు అనుభవించిన మానసిక వేదన, ఖర్చులకు గాను అదనంగా మరో రూ.4వేలను చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.

Comments

comments

Share this post

scroll to top