మీ పాత ఐఫోన్‌ను యాపిల్‌ కావాలనే నెమ్మదిగా పనిచేసేలా చేస్తుంది. ఎందుకో తెలుసా..?

యాపిల్‌కు చెందిన ఐఫోన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. చాలా మంది ఐఫోన్‌ను కొంటున్నారు. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను వాడేవారు కూడా కనీసం జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్‌ను వాడాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ మధ్యే విడుదలైన ఐఫోన్‌ 8, 8 ప్లస్‌, ఐఫోన్‌ 10 స్మార్ట్‌ఫోన్లకు కూడా వినియోగదారుల్లో మంచి ఆదరణే లభిస్తోంది. అయితే కొత్తగా విడుదలైన ఫోన్ల సంగతి ఏమో గానీ అంతకు ముందు వచ్చిన పాత ఐఫోన్లు మాత్రం ఇప్పుడు కొంత స్లోగా నడుస్తున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. అయితే ఇందకు కారణం ఏంటో తెలుసా..? ఇంకెవరు.. యాపిల్‌ కంపెనీయే ఇలా కావాలని పాత ఐఫోన్లను నెమ్మదిగా రన్‌ చేసేలా చేస్తోంది. అవును, షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే.

మీరు ఐఫోన్‌ 5ఎస్‌, 6, 6 ప్లస్‌, 6ఎస్‌, 6ఎస్‌ ప్లస్‌, 7, 7 ప్లస్‌ ఫోన్లలో దేన్నయినా వాడుతున్నారా..? ఇంతకు ముందు కన్నా ఒక్కసారిగా ఫోన్‌ స్లో అయిందా..? అయితే అందుకు కారణం యాపిల్‌ కంపెనీయేనని తెలుసా..? అవును, అది కరెక్టే. ఆయా పాత ఫోన్లను యాపిల్‌ కావాలనే నెమ్మదిగా రన్‌ చేసేలా చేస్తోంది. అయితే యాపిల్‌ కావాలని ఈ పని చేయడం లేదు. అందుకు కారణం ఉంది. అదేమిటంటే…

యాపిల్‌ ఈ మధ్యే తన ఐఫోన్లకు గాను కొత్త ఓఎస్‌ అయిన ఐఓఎస్‌ 11.2ను విడుదల చేసింది కదా. దీన్ని పైన చెప్పిన ఫోన్లలో అప్‌డేట్‌ చేసుకుంటే అప్పుడు ఫోన్లు నెమ్మదిగా రన్‌ అవుతాయి. ఎందుకంటే ఐఓఎస్‌ 11.2 లో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఇచ్చారు. వాటిని తట్టుకోవాలంటే పాత బ్యాటరీలు సరిపోవు. దీంతో ఫోన్‌ ఆకస్మికంగా షట్‌ డౌన్‌ అవుతుంది. దాన్ని నివారించాలంటే ఫోన్‌లో ఉన్న ప్రాసెసర్‌ స్పీడ్‌ను తక్కువ చేయాలి. కనుకనే యాపిల్‌ ఐఓఎస్‌ 11.2 ద్వారా ఆయా ఫోన్లను నెమ్మదిగా పని చేసేలా చేసింది. మరి దీనికి పరిష్కారం లేదా.. అంటే.. ఉంది. ఏమీ లేదు.. సింపుల్‌గా ఆ ఫోన్ల బ్యాటరీలను తీసేయించి కొత్త బ్యాటరీలు వేసుకుంటే చాలు, ఫోన్లు ఎప్పటిలాగే వేగంగా పనిచేస్తాయి..!

Apple Admits That It Intentionally Slows Down Old iPhones And Fans Are Screaming Foul!

Comments

comments

Share this post

scroll to top