అయ్యప్ప స్వామి అప్పం ప్ర‌సాదం త‌యారీ ఆగిపోయిందా.!?

శ‌బ‌రిమ‌లైలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామిని ఏటా ఎంత మంది భ‌క్తులు సంద‌ర్శించుకుంటారో అంద‌రికీ తెలిసిందే. ఏది మొక్కుకున్నా నెర‌వేర్చే స్వామిగా పేరుపొంద‌డంతో ఏటా కొన్ని కోట్ల మంది శ‌బ‌రిమ‌లైను సంద‌ర్శిస్తారు. ఇక అయ్య‌ప్ప స్వాములు మాల వేసుకుని దాన్ని తీసేసే ఈ స‌మ‌యంలోనైతే ఆ ఆల‌యంలో ర‌ద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే అయ్యప్ప ఆల‌యం ఎంత‌గా ప్ర‌సిద్ధి గాంచిందో అక్క‌డ భ‌క్తుల‌కు అందించే ప్రసాదం కూడా అంతే పేరుగాంచింది. ఆ ప్ర‌సాదాన్ని అర‌వ‌ణ‌, అప్పం… అని ర‌క ర‌కాల పేర్లతో పిలుస్తారు. ఈ క్ర‌మంలో ఆ అర‌వ‌ణ ఇక‌పై భ‌క్తుల‌కు ల‌భించే అవ‌కాశం లేదా..? అంటే అందుకు స‌మాధానం అవున‌నే వినిపిస్తోంది.

appam-prasadam

సాధార‌ణంగా అర‌వ‌ణ ప్ర‌సాదాన్ని భ‌క్తులు ఇరుముడిలో తెచ్చే బియ్యం, ఇత‌ర ప‌దార్థాల‌తో చేస్తారు. అనంతరం దాన్ని భ‌క్తుల‌కు విక్ర‌యిస్తారు. వారు డ‌బ్బాలు లేదా ప్యాకెట్ల‌లో ల‌భించే ఆ ప్ర‌సాదాన్ని త‌మ‌కు అనుకూలంగా ఉండేట్టు కొనుగోలు చేస్తారు. అయితే ఈ మ‌ధ్య భ‌క్తులు తెస్తున్న బియ్యం, ఇత‌ర ప‌దార్థాలు నాసిర‌కంగా ఉంటున్నాయ‌ట‌. అందులో నాణ్య‌త లేనివి, క‌ల్తీ అయిన‌వి చాలా ఉంటున్నాయట‌. బియ్యం అయితే అస్స‌లు బాగుండడం లేద‌ట‌. దీంతో అలాంటి బియ్యం, ప‌దార్థాల‌తో చేసిన ప్ర‌సాదం బాగుండ‌డం లేద‌ని ఫుడ్ సేఫ్టీ అధికారులు సందేహం వ్య‌క్తం చేశారు. ఆ ప్ర‌సాదం తింటే భ‌క్తుల‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని చెప్పారు. దీంతో ఆల‌య ప్ర‌త్యేక క‌మిష‌న‌ర్ అప్పం ప్ర‌సాద పంపిణీని నిలిపి వేశారు. ఇక‌పై అప్పంను త‌యారు చేయ‌బోమ‌ని తెలిపారు.

అయితే అప్పం త‌యారీ నిలిపివేయ‌డాన్ని ఆ రాష్ట్ర దేవాదాయ‌, ప‌ర్యాట‌క మంత్రి క‌డకంప‌ల్లి సురేంద్ర‌న్ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఇందుకు గాను స‌ద‌రు క‌మిష‌న‌ర్‌పై ఆయ‌న తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. భ‌క్తులు ప‌విత్రంగా భావించి తీసుకెళ్లే అప్పం ప్ర‌సాదాన్ని నిలిపి వేయ‌డ‌మేమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. భ‌క్తులు తెచ్చే ప‌దార్థాల నాణ్య‌త‌ను త‌ప్పు ప‌ట్టాల్సిన ప‌నిలేద‌ని చెప్పారు. అప్పం ప్ర‌సాదం త‌యారీ ఆపివేయ‌డం స‌రికాద‌ని, భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ తింటాయ‌ని అన్నారు. మ‌రి, మంత్రి గారి ఆదేశాల‌ను అక్క‌డి అధికారులు పాటిస్తారో లేదో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top