ఆపోలో ఆసుపత్రిలో ..పేదలకు ఉచితంగా (25%) వైద్యం చేయాలనే నిబంధన ఉందట!?

ఇది ఆంధ్ర ఇంటెక్చువల్ ఫోరమ్ ఉపాధ్యక్షులు చలసాని శ్రీనివాస్ రాసిన పోస్ట్….యథాతథంగా మీకోసం.

APPOLLO హాస్పిటల్ కు హైదరాబాదులో దాదాపు 30+ ఎకరాలు యన్టీఆర్ గారు ప్రభుత్వ స్థలం అప్పగించే సమయంలో పేదలకు ఉచితంగా (25%?) వైద్యం చేయాలని నిబంధన పెట్టినట్లు నాకు గుర్తు ఇప్పుడు ఆ భూమి ఖరీదు 1500 కోట్లు. అలాగే మరికొన్ని చోట్ల. అసలు ఇప్పుడు ఆయా కార్పోరేట్ వైద్యశాలలలోకి సామాన్యులు వెళ్ళే పరిస్థితి ఉందా? వారు నామ్కే వాస్తే అన్నట్లు కొన్ని స్లమ్స్ లో కొంత వైద్యం చేసామంటారు.

అసలు ఇన్సూరెన్స్ పూర్తిగా లేని మధ్యతరగతి వారు వెళితే వైద్యానికి ముందే ఫీజులు చూసి గుండె గుభేల్ మనదూ? అడిగేదెవరు.. కార్పోరేట్ వారికి సంబధించిన పదిమందిని యంపిలు యం.యల్.ఎలుగా గెలిపించాముగా!

Apollo joins

ఈ విషయంలో తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలూ ఆ కేజ్రీవాల్ గారి దారిలో పయనించాలి. అలాగే సూపర్ స్పెషల్, విఐపి రూముల చార్జీలు వైద్యశాలల ఇష్టం అయితే అవ్వనివ్వండి. కానీ వైద్యంకు అయ్యే లక్షల ఫీజుల రేట్లని కూడా క్రమబద్దీకరించాలి. ఐసియులో రెండు మూడు వారాలు ఉంటే ఇళ్ళమ్ముకున్న వారూ ఉన్నారు.

ఆరోగ్యశ్రీ మంచిదే కాని అదేసమయంలో ప్రభుత్వ వైద్యశాలల్లో సదుపాయాలూ సమాంతరంగా మెరుగుపరఛి “””” నాయకులని కచ్చితంగా అక్కడికే పంపించాలనే నిబంధన లాంటిది పెట్టకపోతే”” …..మొత్తం ప్రభుత్వవైద్యం కుంటుబడి మొత్తం ప్రైవేటు కార్పోరేట్ దోపిడీకి దారితీస్తుంది.- చలసాని

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top