“ఆపద్బాంధవుడు” చిత్రంలో “చిరంజీవి” సరసన నటించిన “మీనాక్షి శేషాద్రి” గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో తెలుసా..?

చుక్కల్లారా..దిక్కుల్లారా…ఎక్కడమ్మా జాబిలీ..! అంటూ మతిస్థిమితం లేని అమ్మాయిలాగా అద్భుతంగా నటించడమే కాదు “ఔరా అమ్మకు చెల్లా..ఆలకించి నమ్మడం ఎల్ల” అంటూ అమాయకంగా కూడా పాడింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా..? అదే అండి “చిరంజీవి” గారు నటించిన “ఆపద్బాంధవుడు” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన “మీనాక్షి శేషాద్రి”. ఆ సినిమానూ ఆ నటననూ ఎవరు మర్చిపోగలరు..! నిజానికి మీనాక్షి తెలుగులో రెండు సినిమాల్లోనే నటించింది కానీ హిందీలో ఎంతో పేరున్న నటి.

మరి ఇప్పుడు ఆ హీరోయిన్ ఎలా ఉంది..? ఎవర్ని పెళ్లి చేసుకుంది..?

హరీష్ మైసూర్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం టెక్సాస్‌లో ఉంటున్న మీనాక్షి ‘చెరిష్‌’ పేరుతో డాన్స్‌ స్కూల్‌ని నడుపుతూ భారతీయ సంప్రదాయ నృత్యాలను నేర్పుతోంది. సినిమాల్లోకి వచ్చేసరికే మీనాక్షికి భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్‌లలో ఎంతో ప్రావీణ్యం ఉంది. వీలైనప్పుడల్లా తన శిష్యులతో కలసి నాట్య ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు సేకరించి వాటిని సేవాకార్యక్రమాలకూ ఉపయోగిస్తోంది. మీనాక్షికి ముగ్గురు పిల్లలు.

Comments

comments

Share this post

scroll to top